ఒక పక్క నలుగురు రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు అంటూ, వార్తలు వస్తున్న టైంలో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే మరో వార్తా వెలుగులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీకి చెందినన, కాపు సామాజికవర్గానికి చెందిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కాకినాడలో రహస్యంగా భేటీ అయ్యారు. కాకినాడ రైల్వేస్టేషన్‌ దగ్గరలోని ఒక హోటల్‌లో వీరందరూ సమావేశమైనట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఈ భేటీ కొనసాగుతోంది. ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది తెలుగుదేశం నేతలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్‌ కార్యాచరణ పై ఈ భేటీలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.

తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై వీరంతా సమాలోచనలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ 14 మందిలో, మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్‌, బొండా ఉమా, వరుపుల రాజా, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళ్రాయుడు, బండారు మాధవనాయుడు, పంచకర్ల రమేష్ బాబు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు తదితరులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే, తాము తెదేపాను వీడేది లేదని బొండా ఉమా, తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం, పార్టీ ఎలా బలపడాలి లాంటి విషయాలు చర్చించామని చెప్తున్నారు. మరో పక్క బీజేపీ పార్టీ నేతలు మాత్రం, చంద్రబాబు విదేశాల నుంచి వచ్చే సరికి, తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తామని అంటున్నారు. ఈ పరిణామాలు గమనిస్తున్న తెలుగుదేశం క్యాడర్ మాత్రం, ఇలాంటివి ఎన్నో చూసామని, నాయకులు ఎంత మంది పోయినా, పార్టీ కార్యకర్తలతో ఇలాగే ఉంటుంది అని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read