జగన్మోహన్ రెడ్డి పాలన దాదాపు రెండున్నరేళ్లకు చేరిందని, ఈ సమయంలో అనేక బాదుడు కార్యక్రమాలను ఆయన ప్రజలపై అమలు చేశారని, గతంలో రకరకాల తప్పుడు వాగ్ధానాలు చేసి, మోసకారి, మాయదారి మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకొని, ఇప్పడు ముఖ్యమంత్రయ్యాక జనం కష్టసుఖాలతో పనిలేకుండా వారి ర-క్తం పీల్చేలా ఆయన పాలన సాగుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక రకరకాలుగా ప్రజలను బాదే పనిని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. చెత్తపన్ను, ఆస్తిపన్ను, నీటి పన్ను వంటి పన్నులతో పాటు, విద్యుత్ ఛార్జీలపెంపు, పెట్రోల్ డీజిల్ ధరలు వి పరీతంగా పెంచేశాడు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇక్కడే ఉన్నాయి. పొరు గురాష్ట్రాలు ఏపీలోని పెట్రోల్ డీజిల్ ధరలను పోలుస్తూ, బంకుల బయట బ్యానర్లు కడుతున్నారు. అవి చూశాకైనా ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. జగన్ ముఖ్యమంత్రయ్యాక ఇప్పటికి మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. మరలా నాలుగోసారి పెంచడానికి సిద్ధమయ్యారు. ప్రతి రెండు, మూడు నెలలకోసారి, ఏదోఒక పేరుతో ఈ ముఖ్యమంత్రి విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేస్తున్నాడు. సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.3,669 కోట్ల భారం వేయడానికి జగన్ రెడ్డి సిద్ధమయ్యాడు. యూనిట్ కు రూ.1.27పైసలు చొప్పున ఏపీ ఎస్పీడీసీఎల్ లో, యూనిట్ కి 45పైసలు చొప్పున ఏపీ ఈసీడీసీఎల్ లో దాదాపు రూ.,3700కోట్ల బాదుడుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో 500 యూనిట్లు దాటిన వారికి యూనిట్ పై 90 పైసలు వరకు పెంచారు. తద్వారా వినియోగదారులపై రూ.1300 కోట్ల వరకు భారం పడింది. శ్లాబ్ లు మార్చికూడా దొడ్డి దారిలో రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల వరకు భారం మోపారు. కిలోవాట్ కు రూ.10చొప్పున పెంచడం ద్వారా రూ.2,500కోట్లు , ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో తాజాగా రూ.3,700 కోట్ల వరకు భారం వేస్తున్నారు. మొత్తంగా చూస్తే రూ.9,500 కోట్ల భారాన్ని విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజలపై మోపింది. ఈ దారుణంపై టీడీపీ ప్రశ్నిస్తుంటే, ఏవేవో చెప్పి తప్పించుకుంటున్నారు.

టీడీపీ ప్రభుత్వంలో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, చంద్రబాబునాయుడు పాలన చేసింది వాస్తవమా ..కాదా అనేదానికి ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రతి దానికి మీడియా ముందుకు తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడేంటి? మంత్రులు సమాధానం చెప్పలేక పోతున్నారా? ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బాలినేనికి లేదా? పెద పాలేరు సమాధానాలు, సంజాయిషీలతో ప్రజలకు పనిలేదు. మంత్రులున్నది దేనికి? వారు ప్రజల ముందుకొచ్చి వివరణ ఇవ్వలేరా? తాడేపల్లి పెదపాలేరు గత ప్రభుత్వం చేసిన పాపాలవల్లే విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుందని చెప్పుకుంటున్నాడు సిగ్గులేకుండా. టీడీ పీప్రభుత్వం ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, విద్యుత్ కోతలు లేకుండా, విద్యుత్ సరఫరాను సక్రమంగా సజావుగా అందించింది. సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి, పైసా కూడా ఛార్జీలు పెంచకుండా చంద్రబాబునాయుడు పాలనచేశారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను టీడీపీప్రభుత్వం అప్పులఊబిలోకి నెట్టిందని కూడా సజ్జల సిగ్గులేకుండా బొంకాడు. రూ.62,463 కోట్ల అప్పుల్లోకి టీడీ పీప్రభుత్వమే కంపెనీలను నెట్టేసిందంటున్నాడు. 2018-2019 సంవత్సరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డిస్కంల పనితీరుకు సంబంధించిన నివేదిక చదివితే, సజ్జల ఎంతగా పచ్చి అబద్ధాలు చెప్పాడో అర్థమవుతుంది. 2019 మార్చి నాటికి ( టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి) ఏపీ ఎస్సీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్ సంస్థలు రూ.18,023 కోట్ల అప్పుల్లో ఉన్నాయని సదరు నివేదిక స్పష్టం చేసింది. నివేదికలో చాలా స్పష్టంగా రూ.18వేల కోట్ల అప్పులని ఉంటే, సజ్జల రూ.62,463 కోట్లని చెబుతాడా?

టీడీపీ ప్రభుత్వంలోనే విద్యుత్ డిస్కంలపై అప్పులు చాలా తక్కువగా ఉన్నాయి. చేతిలో దిక్కుమాలిన పకోడి పేపర్ ఉందనిచెప్పి ఇష్టమొచ్చినట్టు రాయిస్తారా? 420 సజ్జల ఈ వాస్తవాలు తెలుసుకుంటే మంచిది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాకూడా, సమర్థుడైన చంద్రబాబునాయుడుగారు రూపాయి కూడా ప్రజలపై భారం వేయకుండా, విద్యుత్ లో నష్టాలు లేకుండా డిస్కంలను, నడిపించారు. పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాకనే నాలుగుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. విద్యుత్ ఛార్జీలు ఈ విధంగా పెంచుకుంటూ పోతే, ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించడం ఖాయం. టీడీపీత రుపున కూడా ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తున్నాం. పవర్ కంపెనీల పేరుతో ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వేల కోట్ల సొమ్ముని ఏప్యాలెస్ లో దాచాడో లెక్కలు చెప్పాలి. విద్యుత్ సంస్థల గ్రేడింగ్ ఎందుకు పడిపోయిందో కూడా చెప్పాలి. పైసా భారం ప్రజలపై మోపకుండా ఐదేళ్లపాటు చంద్ర బాబు నాయుడి ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందిస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల భారం ప్రజలపై మోపుతూ, వారిని చీకట్లో మగ్గేలా చేస్తున్నాడు. వ్యవసాయానికి విద్యుత్ కనెక్షన్లకు కూడా మీటర్లు బిగించి, రైతులకు ఉచిత విద్యుత్ ను దూరం చేశాడు. గతంలో విద్యుత్ వైర్లు పట్టుకుంటే షాక్ తగిలేది..కానీ ఇప్పుడు విద్యుత్ బిల్లు చూస్తేనే షాక్ కొడుతోంది. అందుకుకారణం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, అసమర్థ ముఖ్యమంత్రే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read