ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో బెంజిసర్కిల్‌ వద్ద గల సర్వోత్తమ భవన్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో ఉచితంగా పుస్తకాలను అందచేస్తున్నారు... పుస్తకాలను విజ్ఞాన వారధులని, అలాంటి పుస్తకాలు కేవలం అలమరకే పరిమితం కాకుండా నలుగురికి జ్ఞానాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఏర్పాట్ల చేస్తోంది. బెంజిసర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయం ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ పండుగ జరుగుతుంది. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఈ నెల 20, 21వ తేదీల్లో పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్ల చేశారు.

free books 20012018 2

103 ఏళ్లుగా గ్రంధాలయ సేవలందిస్తూ, స్వాతంత్యోద్యమానికి బాసటగా నిలిచి ప్రజలను చైతన్య పరచడానికి దోహద పడిన ఈ సంస్థ అందరినీ ఆకర్షిస్తుంది.. ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు ఔత్సాహికులు తమ వద్ద ప్రస్తకాలు ఉన్నాయంటూ.. మాకు ఫలానా పుస్తకం కావాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నాన్ని చాలా మంది ప్రశంసిస్తూ వారి వద్ద ఉన్న పుస్తకాలను అక్కడ అందిస్తున్నారు. అలా సేకరించిన పుస్తకాలే ఇప్పుడు ఇలా ఉచితంగా పంచుతున్నారు...

free books 20012018 3

తత్వశాస్త్రం, మతాలు, ఆధ్యాత్మికత, సాంఘిక, భాష, ఇంజినీరింగ్ వైద్యం, విజ్ఞాన శాస్త్రాలు, కళలు, తెలుగు, ఆంగ్ల సాహిత్య గ్రంధాలు, చరిత్ర, బాల సాహిత్యం, వ్యక్తిత్వ వికాసం తదితర విషయాలకు చెందిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని గ్రంధాలయ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో 2015 నుంచి పుస్తకాలు పంపిణీ జరుగుతోంది. ఇప్పటి వరకు లక్ష పుస్తకాల వరకు పంపీణీ జరిగింది. తొలి ఏడాది కేవలం 8 వేల పుస్తకాలతో ప్రారంభమైన ఈ మహా పుస్తక యజ్ఞంలో,ఈ ఏడాది 50 వేల పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. 2015లో 6 వేలు, 2016లో 42 వేలు, 2017లో 48 వేల పుస్తకాలు పంపిణీ చేశారు. నగరంలోని బెంజిసర్కిల్ సమీపంలో ఉన్న సర్వోత్తమ గ్రంధాలయ ప్రాంగణంలో ఈ నెల 20, 21వ తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల పరకు ఉచిత పుస్తకాల పంపిణీ ఉంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read