రైతులకు 40 వేల విలువైన ఇంధన సామర్థ్య పెంపు సెట్లను ఉచితంగా అందజేసే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభింస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆదివారం ఆయన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన అనంతరం హెరిటేజ్ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడి నుంచి విద్యుత్ శాఖ అధికారులతో టెలిఫోన్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటేనని సీఎం పేర్కొన్నారు. ఈ విధంగా ప్రకటించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. మొబైల్ తో ఆపరేట్ చేసేందుకు సిమ్ కార్డుతో కూడిన స్మార్ట్ ప్యానల్ ఉన్న 5 స్టార్ రేటింగ్ తో ఈ పంపు సెట్లు అందజేయడం వల్ల రైతులకు లబ్ది కలుగుతుందన్నారు.

cbn 15012018 2

ఈ పంపుసెట్లకు ఐదేళ్ల వరకు ఎలాంటి నిర్వహణ మరమ్మతుల ఖర్చులు ఉండవని చెప్పారు. ఒక వేళ పంపుల్లో లోపం తలెత్తితే వెంటనే ఎస్ఎంఎస్ ఇచ్చే వ్యవస్థ కూడా ఇందులో ఉంటుందని, అంతే కాకుండా ఈ పనిముట్ల ద్వారా దాదాపు 30 శాతం విద్యుత్ ఆదా అవుతుం దని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కొత్త పంపుసెట్ల వల్ల రైతులు అర్ధరాత్రి పొలాలకు వెళ్లడం, పాము కాటుకు గురవడం వంటి ప్రమాదాలు తప్పుతాయన్నారు. 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగా 4 లక్షల పాత పంపుసెట్ల స్థానంలో కొత్త వాటిని అమర్చేందుకు డిస్కంలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయన్నారు. తమ ప్రభుత్వానికి రైతే ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఒక రైతుబిడ్డగా, ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతీ పొలానికీ సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు.

cbn 15012018 3

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుందన్నారు. అలాగే పట్టిసీమ ద్వారా గోదావరి, కృషా నదుల అనుసంధానంతో సాగు నీటి వెతలు తీరిపోయాయని చెప్పారు. చిట్టచివరి భూములకు కూడా సాగు నీరు అందిస్తామనే నమ్మకం తనకుందని ధీమా వ్యక్తం చేశారు. నదులు, కాలువలు, వ్యవసాయ పంపు సెట్ల ద్వారా పుష్కలంగా నీరు అందిస్తే మన రైతాంగం పంటలు దిగుబడిలో అద్భుతాలు సృష్టించి దేశానికే ఆదర్భంగా నిలుస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ఇంధన సామర్ధ్య పంపుసెట్లకు తోడు ప్రభుత్వం రైతులకు కొత్తగా సౌర పంపుసెట్ కనెక్షన్లను కూడా అందించ నున్నామని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read