కర్ణాటకకు చెందిన ఎంకే అగ్రోటెక్ (ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్) ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో వంట నూనెల ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. సన్ ఫ్లవర్ నూనెను దిగుమతి చేసుకుని ప్రాసెస్ చేసేందుకు కాకినాడలో ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, రెండేళ్లలో ఇది అందుబాటులోకి వస్తుందని ఎంకే అగ్రోటెక్ జాతీయ అమ్మకాల అధిపతి పెరి మల్లిఖార్జున్ తెలిపారు. దాదాపు 15 ఎకరాల్లో రూ. 200-250 కోట్లతో ఏర్పాటు చేసే ఈ ప్లాంట్ వల్ల దాదాపు 1,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

freedom 18072018 2

సన్ ఫ్లవర్ ముడి నూనెను ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకుంటామని, ముడి వంట నూనెల దిగుమతికి ప్రధానంగా ఓడరేవు ఉండాలని, అందుకనే కాకినాడను ఎంచుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సన్ ఫ్లవర్ నూనె వినియోగం నెలకు 65 వేల టన్నులు ఉందని, ఇందులో బ్రాండెడ్ అమ్మకాలు 35 వేల టన్నులు ఉంటుందన్నారు. 'సన్ ప్యూర్' బ్రాండ్ తో కంపెనీ వంట నూనెలను విక్రయిస్తోంది. కర్ణాటకకు చెందిన ఈ కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలోకి అడుగు పెట్టిన సందర్భంగా మల్లిఖార్జున్ మాట్లాడారు. రసాయన రహిత సన్ ఫ్లవర్ ఆయిల్ ను విక్రయిస్తున్నట్లు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read