దేశంలోనే తొలి గూగుల్ కోడ్ ల్యాబ్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానుంది అంటూ, గత ఏడాది ఒక వార్తా వచ్చింది... దీని పై, కొంత మంది యధావిధిగా ఎగతాళి చేసారు... జగన్ మోహన్ రెడ్డి లాంటి వారైతే, నీ మొఖం, నీ కొడుకు మొఖం చూసి, రాష్ట్రానికి వస్తుందా అంటూ ఎగతాళి చేసారు. కట్ చేస్తే, గూగుల్ కోడ్ ల్యాబ్ మన రాష్ట్రంలో పెట్టటానికి, గూగుల్ కంపెనీ రెండు లక్ష డాలర్లు విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని పెదకాకాని వద్దనున్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇంజనీరింగ్ కళాశాలలో గూగుల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబధించి గూగుల్ నుంచి చెక్ వచ్చినట్టు, VVIT చైర్మన్ విద్యా సాగర్, ఒక ప్రకటనలో తెలిపారు. ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి, గూగుల్ చేత, ఈ ల్యాబ్ ఇక్కడ పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్ నెలకొల్పటానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

google lab 06052018

గూగుల్‌తో కలిసి నిర్వహిస్తున్న, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు సక్సెస్ కావటంతో, దేశంలోనే తొలి కోడ్‌ల్యాబ్‌ ను, గూగుల్ మన రాష్ట్రంలో ఏర్పాటుకు గూగుల్‌ ముందుకు వచ్చింది.. గూగుల్ కోడ్‌ ల్యాబ్‌ ద్వారా, ఇంజినీరింగ్‌లో అండ్రాయిడ్‌ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేవారికి యాప్‌ల తయారీపై ఏకథాన్‌, కోడ్‌ కాన్‌టెస్ట్‌లను నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ లో ఆండ్రాయిడ్ శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చేవారికి యాప్ల తయారీ పై కోడ్ కాన్టెస్టులను నిర్వహిస్తారు. విద్యార్థులు అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ల పనితీరును పరిశీలిస్తారు. అవసరమైన విద్యార్ధులకు ఇక్కడ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.

google lab 06052018

ప్పటికే గూగుల్ మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు.... రాష్ట్రంలో 82 ఇంజనీరింగ్ కళాశాల్లో 17,425 మంది విద్యార్ధులు గూగుల్ ఆండ్రాయిడ్ శిక్షణ పూర్తి చేయగా, ప్రస్తుతం మరో 2,498 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఇంజనీరింగ్ మూడో ఏడాదిలోనే ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఏడాది 10 వేల మందికి విద్యార్థులకు గూగుల్ సర్టిఫికేషన్ ఇప్పించాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ ధృవీకరణ పత్రం లభించిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందుకు ఒక్కో విద్యార్ధికి సుమారు రూ.6,500 వరకూ వ్యయం కానుంది. దీంట్లో 50 శాతం నైపుణ్యాభి వృద్ధి సంస్థ ద్వారా చెల్లించనున్నారు. పాఠశాల స్థాయిలో సాంకేతిక నైపుణ్యం పెంచేందుకు ఐదు నుండి పదో తరగతి వరకూ నాలుగు విడతలుగా గతంలో శిక్షణ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read