2014 ఎన్నికల ముందు అప్పటి ప్రధాని అభ్యర్ధిగా ఉన్న నరేంద్ర మోడీ మాటలు గుర్తున్నాయా ? మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కాంగ్రెస్ మోసం చేసింది, మేము వచ్చి అరటిపండు వలిచి, మీ నోట్లో పెడతాం అన్న విధంగా హామీలు ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయం అయితే, వెంకన్న స్వామి ఎదురుగా నుంచుని, ఆయన మనకు ఇచ్చిన హామీలు ఇంకా మన చేవిల్లో తిరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ హామీలు అమలు కాలేదు కాబట్టే, చంద్రబాబు, మోడీకి ఎదురు తిరిగి, మోడీ ఎలాంటి వాడో దేశమంతా చెప్తున్నారు. అయితే, ఇది ఇలా ఉంటే, ఆ రోజు, ఎన్నికల సమయంలో, మోడీ అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మోడీ ఎంత మోసకారో స్వయంగా గడ్కరీనే చెప్పారు.

gadkari 10102018 2

కలర్స్‌ చానల్‌లో ప్రసారమైన ‘అసల్‌ పవానే- ఇర్సల్‌ నమూనే’ అనే రియాలిటీ షోలో గడ్కరీ, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పాటేకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఇందులో భాగంగా నానాతో సంభాషిస్తూ గడ్కరీ బీజేపీని ఇరకాటంలో పడేసే వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 4, 5 తేదీల్లో రెండు భాగాలుగా ప్రసారమైంది. ‘రాజకీయాలు సినిమా కలిసిన వేళ’ పేరిట మొదటి భాగం, ‘నానా-నితిన్‌ మధ్య చమత్కారం’ పేరిట రెండో భాగం ప్రసారమయ్యాయి. బీజేపీ అధికారంలోకి రావడానికి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చిందని దాపరికం లేకుండా చెప్పేశారు. ఆ హామీలు ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించాయని, వాటిని నెరవేర్చే ప్రయత్నమే జరగలేదని నిష్కపటంగా ఒప్పుకున్నారు.

gadkari 10102018 3


‘‘మేం అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేదు. అందుకే పెద్ద పెద్ద హామీలు ఇవ్వాలని మాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం. ప్రజలు మేం ఇచ్చిన హామీలను మాకు గుర్తు చేస్తున్నారు. మేం నవ్వి వెళ్లిపోతున్నాం’’ అని ఎన్నికల ముందు, ఇప్పటి పరిస్థితుల గురించి గడ్కరీ కుండబద్దలు కొట్టారు. ‘అధికారంలోకి రాలేదనుకోండి... ఇచ్చిన హామీలతో సంబంధమే ఉండదుగా’ అని భావించామంటూ పార్టీ ధోరణిని చెప్పకనే చెప్పారు. కానీ, ప్రజలు తమకు అధికారం కట్టబెట్టడంతో సమస్య వచ్చిపడిందని సరదాగా వ్యాఖ్యానించారు. అయితే గడ్కరీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురించి ఈ వ్యాఖ్యలు చేశారా?, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం గురించి చేశారా? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలతో పారదర్శకంగా, తెరిచిన పుస్తకంలా ఉండే పార్టీ అవసరం ఎంతో ఉందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మోదీ ప్రభుత్వం వంచన, అబద్ధపు హామీలతో ఏర్పడిందన్న తమ అభిప్రాయంతో గడ్కరీ ఏకీభవించారని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌లో వ్యాఖ్యానించింది.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read