పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమావేశం అది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరినీ కలిశారు... నిజానికి ఈ సమావేశం ఒక్క పోలవరం భవిష్యత్తు మాత్రమే కాదు, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మైత్రి బంధం కొనసాగింపు కూడా దీని మీదే ఆధారపడి ఉంది... చంద్రబాబు కూడా డిసైడ్ అయ్యి వెళ్లారు... ఏ మాత్రం తేడా వచ్చినా, కేంద్రానికి రాం రాం చెప్పటానికి రెడీ అయ్యి వెళ్లారు... కాని, సమావేశం మాత్రం మంచి వాతావరణంలో జరిగింది... రాష్ట్రం అడిగిన అనేక విషయాల్లో కేంద్రం క్లారిటీ ఇచ్చింది...

gadkari 14122017 2

పోలవరం కాంక్రీటు పనులను లక్ష్యం ప్రకారం పూర్తి చేయడానికి ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌కి ‘చివరి అవకాశం’ లభించింది. నెల రోజుల్లోపు పనులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేకపోతే... మరొకరికి అప్పగించేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించాయి. అంతేకాదు... పోలవరం ప్రాజెక్టు అంచనాలో పెరిగిన వ్యయాన్ని భరించడంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కేంద్రం సానుకూలంగా ఆలకించింది. పెరిగిన వ్యయంతో 8 రోజుల్లో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌ ) పంపిస్తే కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. అంతేకాదు... పోలవరం అథారిటీకి రెండు రోజుల్లో సీఈవోను నియమిస్తామని తెలిపింది.

gadkari 14122017 3

ప్రస్తుత కాంట్రాక్టరుకు ఒక్క అవకాశం ఇచ్చాం. గడువులోపు పనులు చేయలేకపోతే... ఆ పనిని మరొకరికి అప్పగిస్తాం’’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ విషయంలో ఎంత ఆందోళనతో ఉన్నారో... తాను కూడా అంతే ఆందోళనతో ఉన్నానని గడ్కరీ తెలిపారు. ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా, సోదరుడిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను చేపట్టానని చెప్పారు. తమ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులున్నా తానే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పోలవరం పై గడ్కరీ అత్యంత స్పష్టంగా చెప్పిన మాటలతో అనుభవశాలి అయిన చంద్రబాబు పరిస్థితి ఆసాంతం అర్థం చేసుకున్నారు. అందుకే గడ్కరీతో సమావేశం ముగిసాక ఒకే మాట చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గడ్కరీతో కాకపోతే ఇంకెవ్వరితోకాదు అని,ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం పనుల వేగం పెరిగినట్లు చెప్పారు. ఆ తరువాత గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read