నిన్న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పట్టిసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కృష్ణా డెల్టాకు నీరందించేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పతకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన వైనాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.

ఈ ఏడాది చుక్క నీరు పై నుంచి రాకపోయినా, ఇప్పటికే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 68 టీఎంసీల నీటిని విడుడల చేసినట్లు గడ్కరీకి ముఖ్యమంత్రి తెలిపారు. పట్టిసీమ డెలివరీ పాయింట్‌ను వారు సందర్శించారు.

పోలవరం ప్రాజెక్టు కంటే ముందే కృష్ణ డెల్టా అవసరాలు తీర్చేందుకు చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించారు. దాని కింద రైతులకు సాగు నీరు అందిస్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరందిస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు. ప్రాజెక్టు పురోగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబు వివరించారు.

గడ్కరీ పట్టిసీమ డెలివరీ పాయింట్‌ వద్ద ఆహ్లాదంగా గడిపారు... ఒప్పొంగుతూ వస్తున్నా గోదావరి నీటిని చూసి, ఎంతో ఆనంద పడ్డారు... సముద్రపు పాలవ్వకుండా, నీటిని వినియోగించుకుంటున్న చంద్రబాబుని అభినందించారు... ఈ సందర్భంగా, రాష్ట్రంలో కొంత మంది రాజకీయం కోసం, ఇప్పటికీ పట్టిసీమ దండగ అంటున్నారాని, ముఖ్యమంత్రి గడ్కరీతో చెప్పారు... గడ్కరీ కలగచేసుకుని, "పట్టిసీమ దండగ అన్నోడిని... ఈ నీళ్ళల్లో పడేయండి... ఎక్కడ తెలతాడో తెలిస్తే, అప్పుడన్నా పట్టిసీమ అంటే ఏంటో తెలుస్తుంది" అంటూ గడ్కరీ ఫన్నీ కామెంట్...

Advertisements

Advertisements

Latest Articles

Most Read