సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ- బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాలను టార్గెట్‌ చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. ఏడాది కిందటిదాకా- ఆ మాటకొస్తే కొద్దినెలల కిందటి దాకా మోదీ-షాలను సవాలు చేస్తూ గొంతెత్తడమే ఓ సాహసం.. ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడంగా ఉండేది. కానీ ఎప్పుడైతే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందో- పార్టీలో నిరసన ధ్వనులు క్రమేణా ఊపందుకుంటున్నాయి. వ్యక్తులు సరిగా పనిచేయనపుడు, ఆశించిన ఫలం దక్కనపుడు నాయకులే బాధ్యత వహించాలని ఆయన ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ‘‘నేను పార్టీ అధ్యక్షుణ్నయినపుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయనపుడు తప్పెవరిది? నాదే కదా..!’’ అని ఆయన సూటిగా విమర్శించారు.

cbn protest 26122018

‘‘ప్రస్తుతం హోంశాఖ సమర్థంగా పనిచేస్తోందంటే దానికి కారణం సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. వారిలో అనేకమంది సచ్ఛీలురు, తమ పని భేషుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఓ పార్టీ విషయంలోనూ అంతే.. వ్యక్తులు సరిగా పనిచేయాలి. లేదంటే దానికి నాదే బాధ్యత. వారిని సరిగా తీర్చిదిద్దని తప్పు నాదే అవుతుంది’’ అని ఆయన ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారుల సమావేశంలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘‘వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కిందివారు సరిగా పనిచేయనపుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరనపుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి’’ అని పునరుద్ఘాటించారు. అంతేకాదు, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ-గాంధీ విధానాలను శాశ్వతంగా చెరిపేయాలని ఓ పక్క మోదీ-షా ప్రయత్నిస్తున్న తరుణంలో గడ్కరీ ఈ మాటలన్నారు.

cbn protest 26122018

అంతేకాదు...పరమత ద్వేషాన్ని పెంచిపోషిస్తోందని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటున్న దశలో ఆయన భారతీయ వ్యవస్థకు పెద్ద ఆభరణ పరమత సహనం అన్నారు. ‘‘ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించినంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విద్వాంసుడే కావొచ్చు. అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీరు పొరబడ్డట్లే. కృత్రిమమైన మార్కెటింగ్‌ ఎల్లకాలం నిలవదు’’ అని గడ్కరీ మోదీ-షాలను దృష్టిలో ఉంచుకుని దుయ్యబట్టారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌ల్లో బీజేపీ ఓటమికి నాయకత్వానిదే బాధ్యత అని కిందటివారమే ఓసారి గడ్కరీ ఘాటు విమర్శలు చేశారు. వాటికిది కొనసాగింపు. పార్టీ ఓడిపోయినా - అమిత్‌ షా గానీ, నరేంద్ర మోదీ గానీ ఒక్కసారి కూడా దానిపై సీనియర్‌ నేతలతో సమీక్ష నిర్వహించకపోవడం విమర్శలకు తావిచ్చింది. గెలిస్తే సంబరాలు చేస్తూ, మోదీని కీర్తిస్తూ సమావేశాలు నిర్వహించే అగ్రనేతలు, ఓడిపోతే మాత్రం తప్పు తమది కాదు, స్థానిక నాయకత్వానిదని చెప్పడం అనేక మంది సీనియర్లకు రుచించలేదు. ఆరెస్సె్‌సకు సన్నిహితుడిగా భావిస్తున్న గడ్కరీ- మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని ప్రచారమవుతున్న తరుణంలో ఆయన నుంచి విమర్శలు శరాలు పెరగడం విశేషం. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన- మిత్రపక్షాలకు కూడా సన్నిహితుడు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read