అమరావతిలో రోడ్ల అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని అమరావతి జేఏసీ నేతల వద్ద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన అభిప్రాయాన్ని తెలియ చేసారు. కాంగ్రెస్ నాయకురాలైన పద్మశ్రీ , కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి, అమరావతి జేఏసీ నాయకులు గురువారం గడ్కరీని కలిసారు. అమరావతిలో కేంద్ర ప్రాజెక్ట్ లు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, బెంగుళూరు- అమరావతి వయా అనంతపురం వరకు ఉన్న హైవే రోడ్డును వైసిపి ప్రభుత్వం చిలకలూరుపేట వరకే పరిమితం చేసారని, దానిని అమరావతి వరకు కొనసాగించాలని ఈ సందర్బంగా వారు గడ్కరీని కోరారు. అమరావతికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు కూడా ఏర్పాటు చెయ్యాలని కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ, జగన్ ప్రభుత్వం, తమకు ఏ మాత్రం సహకరించడం లేదని, వాళ్ళ సహకారం లేకుండా తాము ముందుకు వెళ్ళలేమని ఆయన వారితో చెప్పారు. ఈ విషయం పై గడ్కరీ సలహా ఇస్తూ , వారిని కోర్టులో అపీల్ చేయమని సహ్లా ఇచ్చారు. అ తరువాత కోర్టే ఈ రహదారులను అభివృద్ధి చేయమంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుందని గడ్కరీ సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read