ఈ రోజు బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ఓపెనింగ్ తో పాటుగా, ఇతర కార్యక్రమాల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నితిన్ గడ్కరీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు షాక్ అయ్యారు. ఆయన ఒక పక్కన పోగుడుతూనే, మరో పక్క సుతిమెత్తగా అంటించిన చురకలతో, వైసీపీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. అసలు ఆయన అన్నది తమనేనా, తమ అధినేతనేనా అనే కన్ఫ్యూషన్ లో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. గడ్కరీ మాట్లాడుతూ "నాయకుడికి బలమైన రాజకీయ ఆకాంక్ష ఉన్నప్పుడే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి బలమైన రాజకీయ ఆకాంక్ష చాలా చాలా ముఖ్యం. మీరు కళ్లు దానం చేయొచ్చు... కానీ ముందు చూపును (విజన్) దానం చేయలేరు. నాయకులకు ముందు చూపు లేకపోవడం.... మన దేశం యొక్క అతి పెద్ద సమస్య. ముందుచూపు తో కూడిన విధానాలు, పారదర్శకత, నిర్ణీత సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయటం, నాణ్యమైన విధానం.... అన్నిటికి మించి.... అవినీతి రహిత పాలన..... ఇవి... ఈరోజు మన దేశానికి కావలసినవి. ఇవి మన ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తాయి. భారత దేశ ఆర్థిక అభివృద్ధి లో... ఆంధ్రప్రదేశ్ ది కీలక పాత్ర... ధ్రప్రదేశ్ రికార్డులు పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుంది."
"మంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వర్తక, వాణిజ్యాలను గణనీయంగా అభివృద్ధి చేయొచ్చు..... ముఖ్యంగా రేవు పట్టణాల అభివృద్ధి ద్వారా. నేను గతంలో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి.... పోలవరం గురించి వినేవాడిని. కొంతమంది .... సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించుకుంటారు. మరికొంతమంది.... అవకాశాల్లో నుంచి సమస్యలు సృష్టిస్తుంటారు" ఇది ఈరోజు విజయవాడలో..... జగన్మోహన్ రెడ్డి సమక్షంలో..... కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఉపన్యాసం. ఈ ఉపన్యాసంటి నితిన్ గడ్ఖరీ ఎవరి గురించి చెప్పారు, ఎందుకు చెప్పారో అర్ధం కాక, బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు వైసీపీ శ్రేణులు. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఎప్పుడూ వాడే ఊత పదం, సంక్షోభం నుంచి అవకాశాలను సృష్టించుకుంటాను అనే మాటను, ఇక్కడ ఉపయోగించిన గడ్కరీ, కొంత మంది మాత్రం అవకాశాల్లో నుంచి సమస్యలు సృష్టిస్తుంటారు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా, ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారో అర్ధం అవుతుంది.