కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఏప్రిల్ ఒకటో తేదీన వస్తున్నారంటూ జలనితిన్ గడ్కరీ కార్యాలయ అధికార వర్గాలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అయితే, వెంటనే మరో కబురు వచ్చింది... అదే రోజున పార్లమెంటరీ కమిటీ సమావేశం ఉన్నందున పర్యటన వాయిదా పడిందంటూ జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు.. ఆ వెనువెంటనే గడ్కరీ కార్యాలయం నుంచి సమాచారం చేరింది. బుధవారం ఉదయం గడ్కరీ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు.. ఏప్రిల్ ఒకటో తేదీ, ఆదివారం ఉదయం నాగపూర్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి గడ్కరీ చేరుకుంటారు.
అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకొని, అంతర్గత జలరవాణా వ్యవస్థను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమం అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి గడ్కరీ వెళతారు. కాని, ఈ పర్యటన వాయిదా వెనుక ఢిల్లీ పెద్దల నుంచి ఒత్తిడి కారణంగా చెప్తున్నారు... నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పోలవరం పనులు ఎప్పుడూ లేనంత వేగంగా పరుగులు పెడుతుంది... పనులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి... మరో పక్క, అన్ని కమిటీలు పోలవరంలో అవినీతి అనేది లేదని తేల్చాయి...
ఇలాంటి పరిస్థుతుల్లో కనుక కేంద్ర మంత్రి పోలవరం సందర్శనకు వెళ్తే, అక్కడ పోలవరంలో జరుగుతున్న పనిని మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది... ఇలా జరిగితే, ఇప్పటికే పోలవరం కొత్త అంచనాలు రూ.58,319.06 కోట్లకు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.. ఇలాంటి పరిస్థుతుల్లో, పోలవరం పై పోజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే, కేంద్రం పోలవరం పై ఎదో రకంగా, రాష్ట్రానికి సాయం చెయ్యాల్సి ఉంటుంది... ఇలా చేస్తే, చంద్రబాబు పోలవరం కట్టేస్తాడు... అందుకే, ఇప్పుడు ఉన్న పరిస్థుతుల్లో కేంద్రం మంత్రి పోలవరం పర్యటనకు వెళ్ళవద్దు అంటూ, ఢిల్లీ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.. ఎందుకంటే, అదే రోజున పార్లమెంటరీ కమిటీ సమావేశం అప్పటికప్పుడు పెట్టింది కాదు, అది ఉందని ముందే తెలిసినా, గడ్కరీ పోలవరం పర్యటన పెట్టుకున్నారు... ఎవరో ఒత్తిడి తెస్తేనే, పర్యటన వాయిదా పడిందని, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి...