రాష్ట్రంలో ఇలాంటి అజ్ఞాలుతో, చంద్రబాబు స్థాయి నాయకుడు పోటీ పడాల్సిన పరిస్థితి... ఇద్దరు ఉన్నారో, ఒకరికి మించిన అజ్ఞానం మరొకరిది... మోడీ అనే పేరు ఎత్తే ధైర్యం లేక, మోడీ చేసే తప్పులకి కూడా చంద్రబాబు మీద పడి ఏడుస్తూ ఉంటారు... ఎందుకంటే మోడీ మీద ఒక్క విమర్శ చేస్తే, అక్కడ అమిత్ రియాక్ట్ అయితే, ఒకడికి కేసులు, ఇంకొకడికి పెన్ డ్రైవ్ లు బయటకు వస్తాయి... అందుకే ప్రతి సందర్భంలో, మోడీని ఒక్క మాట కూడా అనుకుండా, ప్రతి దానికి చంద్రబాబునే నిందిస్తూ ఉంటారు... ఈ కోవలోనే విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ పై ఒక విష ప్రచారం చేస్తున్నారు. దుర్గగుడి ఫ్లై ఓవర్, కట్టేది నేషనల్ హైవే మీద... కేంద్రం రకరకాలుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇబ్బంది పెడుతుంది... నేషనల్ హై వే మీద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు.... కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. దీంతో అసలకే దారుణంగా నడుస్తున్న ప్రాజెక్ట్, మరింత జాప్యం అవుతోంది. మరోవైపు డీవియేషన్లు (మార్పులు, చేర్పులను) కూడా కేంద్రం అంగీకరించక పోవటంతో ఢిల్లీ నుంచి అమరావతికి ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పేరు కేంద్రానికి... ఊరు రాష్ట్రానికి అన్నట్లు తయారైంది... రూ. కోట్ల వెచ్చిస్తున్నా, అది కేంద్ర ప్రాజెక్టు ఖాతాలోకి వెళ్లింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ, జనసేన మాత్రం, ఇదేదో చంద్రబాబు చేతకానితనంగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రే, దీని పై స్టేట్మెంట్ ఇచ్చి, ఇలాంటి వారి నోర్లు ముపించారు.
దుర్గ గుడి ఫ్లైఓవర్ పనులు ఎంతకీ పూర్తికాకపోవడం పై కేంద్రం ఆ కాంట్రాక్టు సంస్థను మందలించింది. నిర్మాణ సంస్థ విషయంలో అంచనాలు తలకిందులయ్యాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం ఏడాదిలోనే పనులు పూర్తి చేస్తామని ఒప్పందం చేసుకొన్న సంస్త రెండేళ్లు దాటినా పనులను కొలిక్కి తీసు కురాలేకపోతోందని, ఫలితంగా ప్రాజెక్టు పై ఆర్టీక భారం పడుతోందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ(ఎంవోఆర్ టీహెచ్) ఇటీవల బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా.. ఢిల్లీలో జరిగిన సమీ క్షలో ఎంవోఆర్టీ హెచ్ ఉన్నతాధికారులు ఈ విషయంపై ఏపీ జాతీయ రహదారుల విభాగం అధికారులను నిలదీసినట్లు తెలిసింది. కాగా, పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే మార్చి 31 నాటికి పూర్తిచేయాలని కేంద్రం తాజా గడువు విధించింది. అప్పటికీ పనులు పూర్తి కాకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరించి నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మొత్తం ఫైలును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల తెప్పించుకొని పరిశీలించినట్లు తెలిసింది. దుర్గమ్మ ఫ్లైవోవర్ ఎందుకు ఆలస్యం ఆష్పతోంది? మీరేం చేస్తున్నారంటూ ఎన్ హెచ్ఏ ఐ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఇదే సందర్భంలో, కేంద్రం కావాలని చేస్తున్న జాప్యం మాత్రం బయటకు రానివ్వకుండా, కాంట్రాక్టు సంస్థ మీదకు తోసెయ్యటం గమనించాలి. ఏదేమైనా, ఇప్పటికైనా ఈ ప్రాజెక్ట్ కేంద్ర పరిధిలో ఉందని, మన రాష్ట్రంలోని అజ్ఞానులు గుర్తిస్తే మంచిది.