ఆంధ్రప్రదేశ్ మంత్రులు అందరూ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేసారు. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో, రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందచేసారు. ఆ రాజీనామా లేఖలు గవర్నర్ కార్యాలయానికి కూడా చేరాయి. ఈ రాత్రికి గవర్నర్ వాటిని ఆమోదిస్తారు. మరి కొద్ది సేపట్లో ఈ మంత్రులు అందరూ ఇక మాజీ మంత్రులుగా మిగిలిపోతారు. ఇప్పటికే క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత, మంత్రులు అందరూ ప్రోటోకాల్ వెహికల్స్ లేకుండా, తమ వాహనాల్లోనే వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆసక్తి మాత్రం, కొత్త క్యాబినెట్ లో ఎవరికి అవకాసం దక్కుతుంది ? కొత్త క్యాబినెట్ లో కొనసాగే మంత్రులు ఎవరు ? దీని పైనే సస్పెన్స్ నడుస్తుంది. ఇప్పటికే పాత మంత్రులు నలుగురు వరుకు కొత్త క్యాబినెట్ లో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే, ఇందులో సీనియర్ నేతలు బొత్సా, పెద్దిరెడ్డి, బాలినేని ఉంటారని అందరూ భావించారు. కానీ వారికి ఇప్పటికే వారు కొనసాగరు అని సంకేతాలు వెళ్లాయని చెప్తున్నారు. దీంతో ఆ నలుగురు మంత్రులు ఎవరూ అనేది చర్చ నడుస్తున్న వేళ, ఇప్పుడు కొత్త వార్త చక్కర్లు కొడుతుంది. కర్ణాటక మైనింగ్ డాన్ గాలి జనర్ధర్ రెడ్డి, ఒక మంత్రి కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గాలి జనార్ధన్ రెడ్డిని నా పెద్ద కొడుకు అంటూ వైఎస్ఆర్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

jagan 07042022 2

అయితే జగన్ తో, గాలి జనర్ధర్ రెడ్డికి ఉన్న సంబంధాల నేపధ్యంలో, గుమ్మనూరు జయరాం తన మంత్రి పదవి ఊడకుండా ఉండటానికి లాబీయింగ్ చేసారు అంటూ వార్తలు వస్తున్నాయి. జయరాంతో పాటుగా, ఆదిమూలపు సురేశ్‌, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ మంత్రులు కూడా కొనసాగుతారని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కొత్త మంత్రులు విషయంలో, కూడా సస్పెన్స్ నెలకొంది. కొత్త మంత్రులుగా ఎవరు వస్తారు అనే విషయం పై, జోరుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పై దారుణమైన వ్యతిరేకత ఉందని, ప్రశాంత్ కిషోర్ పెద్ద రిపోర్ట్ ఇచ్చారని, దాని ఆధారంగా ఈ మంత్రి వర్గంలో చోటు ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువగా బలహీన వర్గాలను నింపేసి, కేవలం జగన్ రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అనే వాదనను కొద్దిగా చెక్ పెట్టటానికి ఈ ప్రయత్నం ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. ఇక దీని పై సీనియర్ నాయకులు ఎలా స్పందిస్తారు, వారిని ఎలా బుజ్జగించాలి అనే దాని పై కూడా వైసీపీలో చర్చ జరుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read