వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైములో, మైనింగ్‌లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించటమే కాదు.. చట్టాలు తనకెంత చుట్టాలన్న విషయాన్ని నిరూపిస్తూ.. బళ్లారి ఓబులాపురం మైనింగ్ యజమాని.. మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఎంత హవా నడిపారో అందరికి తెలిసిందే. ఆయన్ను టచ్ చేసేందుకు సైతం రాజ్యాంగ శక్తులు సైతం వెనక్కి తగ్గే పరిస్థితుల్లో.. ప్రజాస్వామ్య భారతంలో ఏదైనా సాధ్యమన్న విషయాన్ని గాలి జనార్ధనరెడ్డి ఉదంతం చాలామందికి తెలియజేసిందని చెప్పాలి. సీబీఐ పుణ్యమా అని ఒక్కసారి జైల్లోకి వెళ్లిన ఆయనకు.. చట్టం తన పని తాను చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయం బాగానే అర్థమైందని చెప్పాలి. తనకు బెయిల్ ఇవ్వటానికి వందకోట్ల రూపాయిలు ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడలేదు.
తదనంతరం ఆయన ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు ఆయనకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఆయన దాదపుగా 2.5 ఏళ్ళు జైలు జీవితం గడిపి, ప్రస్తుతం, మన జగన్ లాగే, కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్నాడు. ఇంత జరిగినా గాలికి బుద్ధి రాలేదని విషయం అర్ధమవుతుంది. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని మదమో, లేక డబ్బు మదమో కాని, వ్యవస్థలకు మ్యానేజ్ చేస్తూ మరోసారి దొరికిపోయి, పోలీసులు పట్టుకుంటారని చెప్పి పారిపోయాడు గాలి. దీని వెనుక నిజాలు తెలిస్తే మైండ్ పోతుంది. బెంగళూరులోని అంబిడెంట్ కంపెనీ విదేశీ పెట్టుబడుల విషయంలో విచారణను ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో గాలి వర్గీయులు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా కంపెనీ 57 కేజీల బంగారు కడ్డీలను రహస్యంగా అందించింది. దీంతో రంగంలోకి దిగిన గాలి జనార్దన రెడ్డి ఓ ఈడీ అధికారికి రూ.కోటి లంచం ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ముందే తెలుసుకున్న గాలి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇది వరకు సిబిఐ వాళ్లకి లంచాలు ఇవ్వటం, ఏకంగా సుప్రీం కోర్ట్ జడ్జికి లంచాలు ఇవ్వటం లాంటి కేసుల్లో ఇరుక్కున్నా, ఇప్పటికీ బుద్ధి రాని గాలి, ఏకంగా ఈడీ అధికారులకి కోటి రూపాయలు ఇచ్చారు. కేంద్ర పెద్దల సహకారం లేనిదే, ఇలాంటివి జరిగే అవకాశాలు లేవు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, గాలి వ్యవహారం బయట పడింది. లేకపోతే, ఇది కూడా సైలెంట్ గా జరిగిపోయేది.