మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి ఉన్నట్టుండి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు రూ. 600 కోట్ల ‘అంబిడెంట్’ కంపెనీ స్కామ్‌ కేసులో జనార్ధన్‌రెడ్డి పేరు ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన కనిపించకుండా పోయారని అనుకుంటున్నారు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి కనిపించకుండా పోవడం వెనుక ఏం జరిగిందనే విషయం పై జాతీయ మీడియా కధనం రాసింది. ‘అంబిడెంట్’ కేసు విచారణకు ఇంచార్జిగా ఇటీవల ఏడీజీపీ అలోక్ కుమార్‌ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఫరీద్‌ను అలోక్ తనదైన శైలిలో విచారించారు. తాను.. ప్రజలను మోసం చేసిన మాట వాస్తమేనని, తనకు డబ్బున్న స్నేహితులు ఉన్నారని, వాళ్ల సాయంతో ప్రజల డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాని ఏడీజీపీ అలోక్‌కు ఫరీద్ ప్రామిస్ చేశాడు.

gali 08112018 2

ఆ రిచ్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాలంటూ ఫరీద్‌పై సీసీబీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. దీంతో అలీఖాన్ పేరును ఫరీద్ బయటపెట్టాడు. అతడు జనార్ధన్‌రెడ్డికి అనుచరుడని కూడా చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. నిందుతుడు ఫరీద్.. గాలిజనార్ధన్‌రెడ్డి పేరును బయటపెట్టడంతో ఏడీజీపీ అలోక్ వర్మ ఆ విషయాన్ని వెంటనే సీఎం కుమారస్వామి తెలియజేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయం బయటకు పొక్కకూడదని, ఎన్నికల సమయంలో గాలి జనార్ధన్‌రెడ్డిని అరెస్టు చేస్తే రాజకీయ లాభాల కోసం చేశారనే అపవాదు వస్తుందని, అందుకే గాలి అరెస్టును కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అలీఖాన్‌ను మాత్రం అరెస్టు చేయడానికి అవకాశం ఉందని పోలీసుల నుంచి సమాచారం రావడంతో అతడు ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే గాలి జనార్ధన్‌రెడ్డి మాత్రం అప్పటి నుంచి కనిపించకుండా పోయారు.

gali 08112018 3

ఫరీద్‌ను విచారిస్తున్న సీసీబీకి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఫరీద్ స్నేహితుల గురించి ఆరా తీయగా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ రియల్టర్ బ్రిజేష్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అతడి ద్వారానే ఫరీద్‌కు, జనార్ధన్‌రెడ్డికి మధ్య ఫస్ట్ మీటింగ్ జరిగినట్లు తెలిసింది. ఈ ఏడాది మార్చిలో పోష్ బెంగళూరు హోటల్‌లో గాలి జనార్ధన్‌రెడ్డిని కలిసినట్లు సీసీబీ కస్టడీలో ఉన్న ఫరీద్ అంగీరించాడు. తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌కు సంబంధించి ఫరీద్ ఫోన్ నుంచి 21 ఫోటోలను సీసీబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫొటోలకు జియో ట్యాగింగ్ ఉండడంతో వాటిపై డేట్, టైమ్ కూడా రికార్డ్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. రూ. 18 కోట్ల లావాదేవీలకు సంబంధించి రమేష్ కొతారికి చెందిన అంబికా సేల్స్ కార్పొరేషన్‌ నుంచి ఆరు ఓచర్లను సీసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజులుగా గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలో ఉండడంతో అతడు దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. దేశంలోని విమానాశ్రాయాలు, ఓడ రేవులను అప్రమత్తం చేశారు. గాలి ఆచూకీ కనుగొనేందు కోసం సీసీబీ నాలుగు ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read