రాజశేఖర్ రెడ్డి ముద్దుగా పెద్ద కొడుకు అని పిలుచుకునే వ్యక్తి, జగన్ మోహన్ రెడ్డికి సోదర సమానుడు... ఇది జగన్ బ్యాచ్ గాలి జనార్ధన్ రెడ్డి గురించి ముద్దుగా పిలుచుకునే తీరు... సామాన్య ప్రజలు మాత్రం, సహజ వనరులు కొట్టేసిన దొంగ... బెయిల్ కోసం జడ్జికే లంచం ఇచ్చిన వాడు.. జైలు జీవితం అనుభవించి, కండీషనల్ బెయిల్ పై, బయట తిరుగుతున్న వాడిగా పిలుస్తారు.. ఓబులాపురం గనుల కొట్టేసి, లక్షల కోట్లు వెనకేసుకున్న గాలి జనార్ధన్ రెడ్డి, ఎట్టకేలక తెలుగు మీడియా ముందుకు వచ్చాడు.. అది కూడా, స్టీల్ ప్లాంట్ కోసం.. ఒక పక్క, బీజేపీ, జగన కలిసి, గాలి జనార్ధన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ కట్టబట్టే కుట్ర చేస్తున్నారు అనే విమర్శలు చేస్తూ ఉండగానే, ఈయన మీడియా ముందుకు వచ్చాడు.

gali 24062018 2

బ్రాహ్మణి స్టీల్స్ కోసం దాదాపు రూ.1350 కోట్లు ఖర్చు పెట్టానని, కడపలో స్టీల్ ప్లాంట్ పనులు తనకే అప్పగించాలని కోరారు. ఒకవేళ స్టీల్ ప్లాంట్ పనులు వేరే వాళ్లకు కేటాయిస్తే, తాను పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతిస్తే రెండేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి చూపిస్తానని, అవసరమైతే, చంద్రబాబును కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, బ్రాహ్మణి స్టీల్స్ కు సంబంధించిన అన్ని వివరాలు అందజేస్తానని చెప్పారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదంటూ మెకాన్ సంస్థ నివేదిక ఇవ్వడాన్ని తప్పుబట్టారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయని గతంలో ఇదే సంస్థ నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

gali 24062018 3

నిజానికి, ఆ ఖర్చు పెట్టిన రూ.1350 కోట్లకు సంబదించిన మిషనరీ, సిబిఐ జప్తు చేసింది. ఎందుకంటే, అది కూడా ప్రజల దగ్గర కొట్టేసిన డబ్బు కాబట్టి. అంతే కాదు, ఈ బ్రాహ్మణి స్టీల్స్ కోసం రాజశేఖర్ రెడ్డి చేసిన అరాచకం ఎవరూ మర్చిపోలేదు. ఎకరా 18000 లెక్క పదివేల ఎకరాలు, వైస్, గాలి జనార్దనరెడ్డికి కి ఇస్తుంటే, ఏడ్చిన వారిని, మరింత ఎగతాళి చేసేలా, విమానాశ్రయంకు కూడా అని, మరో నాలుగు వేల ఎకరాలు ఇచ్చాడు, కావాలంటే మరో పదివేల ఎకరాలు ఇస్తా అన్నాడు. వచ్చి పడిన వేల ఎకరాల భూములను బ్యాంకులో తాకటెట్టాడు గాలి. వైఎస్ కు బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఇచ్చాడు. జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. బ్రహ్మణి ఉక్కు భ్రమలు మెల్లగా వీడిపోయాయి. ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి, మళ్ళీ వచ్చి, నేను స్టీల్ ప్లాంట్ కడతాను, నాకు ఇవ్వండి అంటున్నాడు.. ఒక దొంగకి, ఏ ప్రభుత్వం అన్నా, ఇలాంటివి ఇస్తుందా ? లేకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి అంట, ఈయన గారు కష్టపడి సంపాదించిన సొమ్ము మరి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read