మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే రీసౌండ్ ఇంకా బీజేపీ నేతల చేవిల్లో తిరుగుతూ ఉండగానే, ఈ రోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రం పై విరుచుకు పడ్డారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ.. విభజన చట్టంలోని ఏ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని సభ దృష్టికి తెచ్చారు. అశాస్త్రీయ విభజనతో రాష్ట్రం చాలా నష్టపోయిందని, ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేక విధానం అమలు చేస్తామన్నకేంద్రం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

galla 09082018 2

జీఎస్టీ వల్ల ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.2600 కోట్లు నష్టపోతుందని వివరించారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటి వరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు విభజన చట్టం ప్రకారం న్యాయం చేయాలని జయదేవ్‌ డిమాండ్‌ చేశారు. రియల్‌ ఎస్టేట్‌పై జీఎస్టీ 5శాతం మాత్రమే ఉండాలని, ఎండుమిర్చి, చింతపండు, పసుపు పంటలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

galla 09082018 3

లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా టీడీపీ పార్లమెంట్‌లో తమ గళం వినిపిస్తోంది. సీఎం చంద్రబాబు సూచనతో క్వశ్చన్ అవర్, జీరో అవర్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను లోక్‌సభలో ప్రస్తావిస్తున్నారు ఎంపీలు. అలాగే కాపు రిజర్వేషన్లపై కూడా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read