గత పార్లమెంట్ లో, మోడీని ఏకిపారేసిన ఆంధ్రుడిగా పేరు తెచ్చుకున్న గుంటూరు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు గల్లా జయాదేవ్, ఈ పార్లమెంట్ లో కూడా బీజేపీ పై నిప్పులు చెరిగారు. ఈ ప్రాసెస్ లో, అటు వైసీపీని టార్గెట్ చేసుకున్న విధానంతో, వైసీపీ కక్కలేక, మింగలేక మిన్నకుండి పోయింది. ఈ రోజు లోక్‌సభలో, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై గల్లా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా విషయంలో, ఇదే పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటం గురించి చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎంతో నష్టపోయినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసామని గుర్తు చేసారు. అదే సందర్భంలో, ప్రత్యేక హోదా హామీ పై మాట తప్పినందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అడ్డ్రెస్ లేకుండా పోయిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యెక హోదా సాధించలేదు అనే ఉద్దేశంతో ప్రజలు ఓడించారని, జగన్ చేసిన ప్రకటనలతో మెడలు వంచి ప్రత్యెక హోదా తెస్తారని ప్రజలు భావించారని, అందుకే వాళ్ళని గెలిపించారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని, జగన్ చెప్పినట్టు మోడీ మెడలు వంచి, ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ పార్టీపైనే ఉందని గల్లా అన్నారు. అయితే జగన్ వైఖరిలో మాత్రం తేడా కనిపిస్తుందని అన్నారు. మొన్న ఢిల్లీ వచ్చి, ప్రధానితో భేటీ అయిన సమయంలో మాట్లాడుతూ, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ, ప్రతిసారీ మోడీతో హోదా ప్రస్తావన తెస్తానని జగన్‌ చెప్పారని గుర్తుచేశారు. ప్రధానితో భేటీ అయ్యి, బయటకు వచ్చి జగన్ ఈ వ్యాఖ్యలు చేసారంటే, మోడీ ప్రత్యేకహోదా ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంఅవ్తుందని, నిన్న ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చేది అంశం పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ లో చెప్పిన విషయాన్ని గల్లా గుర్తుచేశారు. ఇప్పుడు మోడీ మెడలు వంచి, 22 మందితో హోదా తీసుకు రావాల్సిన బాధ్యత జగన్ డే అని గల్లా అన్నారు. అయితే గల్లా చేసిన వ్యాఖ్యలతో, వైసీపీ సభ్యులు సైలెంట్ అయిపోయారు. కనీసం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఎక్కడ మోడీకి కోపం వస్తుందో అని, వింటూ ఉండి పోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read