ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, పార్లిమెంట్ వేదికంగా, కేంద్రం పై తెలుగుదేశం పార్టీ ఎంపీల పోరాటం కొనసాగుతూనే ఉంది. గత పార్లిమెంట్ లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విభజన హామీల్లో చేసిన అన్యాయం పై, మోడీ ప్రభుత్వం పై, ఏకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ, పోరాడిన సంగతి తెలిసిందే. తరువాత దేశ వ్యాప్త పోరాటం కూడా తెలుగుదేశం చేసింది. అయితే, ఈ పోరాటంతో, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా నష్టపోయినా, ప్రధాని మోడీ , అమిత్ షా లను ధీటుగా ఎదుర్కున్న పార్టీగా, చరిత్రలో నిలిచింది. ఓడిపోయిన తరువాత కూడా, కేంద్రంలో ఉన్న బీజేపీ పై, అనేక సమస్యల పై తెలుగుదేశం పార్టీ, పోరాడుతూనే ఉంది. అమరావతిని ఇండియా మ్యాప్ లో పెట్టకపోవటంతో, తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తటంతో, అనూహ్యంగా ఒక్క రోజులోనే కేంద్రం స్పందించి, అమరావతిని ఇండియా మ్యాప్ లో పెట్టి, కొత్త మ్యాప్ ని రిలీజ్ చేసారు. ఆంధ్రులకు రాజధాని ఉంది, అనే అంశం పై పోరాడి సాధించారు.

galla 27112019 2

అయితే నిన్న మరో సమస్య పై కూడా, తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని నిలదీసింది. అమరావతిలో, 2015లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ), జరీ చేసిన డిగ్రీల పై , స్పష్టత ఇవ్వాలని, కేంద్రాన్ని కోరారు, తెలుగుదేశం పార్టీ నేత జయదేవ్‌ కోరారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్-2019 బిల్లు పై, లోకసభ లో మంగళవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా, జయదేవ్ ఈ అవకాశాన్ని, రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడుకుని, కేంద్రాన్ని ప్రశ్నించారు. అమరావతి ఎన్‌ఐడీ ఏర్పాటుకు, గెజిట్‌ జారీకి సంబంధించి, వేరే వేరే తేదీలు ఉన్నాయని, మరి గతంలో ఎన్‌ఐడీ అమరావతి జారీ చేసిన డిగ్రీలకు గుర్తింపు ఉంటుందో లేదో చెప్పాలని, దీని పై పూర్తీ స్పష్టత ఇవ్వాలని గల్లా కోరారు.

galla 27112019 3

ఈ బిల్లులో ఎన్‌ఐడీ 2014 అహ్మదాబాద్‌ నోటిఫికేషన్‌ జారీ నుంచే అమల్లో ఉందని, మరి అమరావతి, మిగతా రెండు ఎన్‌ఐడీల విషయంలో కేంద్రం వివక్ష ఎందుకు చూపుతున్నారో తెలపాలని కోరారు. అహ్మదాబాద్‌ ఎన్‌ఐడీలో లాగానే, అమరావతిలోనూ పీహెచ్‌డీకి అవకాశం కల్పించాలని కోరారు. అమరావతిలో ఎన్‌ఐడీ నాగార్జున విశ్వ విద్యాలయంలోని తాత్కాలిక క్యాంపస్‌లో నడుస్తోందని, వెంటనే నిర్మాణం పూర్తీ స్థాయి నిర్మాణం పూర్తీ చెయ్యాలని కోరారు. మరో పక్క ఇదే సందర్భంలో, వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, అమరావతి ఆకృతులు ఇక్కడ ఎవరూ చెయ్యలేరని, గతంలో చంద్రబాబు సింగపూర్ వద్దకు వెళ్లారు అంటూ, రాజకీయం చేసే ప్రయత్నం చెయ్యటంతో, గల్లా అడ్డుకున్నారు. ఆరు నెలలుగా అధికారంలోకి వచ్చి, అప్పటి నుంచి నిర్మాణాలు ఆపివేయడం, కూల్చివేయడం చేస్తున్న మీరు కూడా నిర్మాణాలు, ఆకృతుల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read