ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఈ రోజు అమరావతిలోనే కాదు, ఢిల్లీలో కూడా హీట్ ఎక్కింది. ఈ రోజు చంద్రబాబు అమరావతి పర్యటనతో, ఒక్కసారిగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటన సాఫీగా సాగితే ఇబ్బంది ఉండేది కాదు కాని, కావాలని చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చెయ్యటంతో, ఒక్కసారిగా వాతవరణం వేడెక్కింది. అయితే ఇక్కడ ఇలా ఉండగానే, ఢిల్లీలోని పార్లమెంట్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ తరుపున, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ఈ రోజు పార్లమెంట్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితి గురించి వివరిస్తూ, ప్రధాని మోడీ ఈ విషయాల పై చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీరుతో, రాష్ట్రం దారుణంగా నష్టపోయిందని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, వచ్చే పెట్టుబడులు కూడా వెనక్కు వెళ్ళిపోతున్నాయని, లోక్ సభలో, గల్లా జయదేవ్ ఆరోపించారు.
దేశంలో పెట్టుబడులు పెంచి, దేశం ఇమేజ్ పెంచి, ఆర్ధికంగా దేశాన్ని బలోపేతం చెయ్యాలని, కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, పెట్టుబడిదారులు వెనక్కి వెల్లిపోయేలా చేస్తున్నారని, గల్లా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలో కుదుర్చుకున్న కాంట్రాక్టలను రద్దు చెయ్యటం, అలాగే విద్యుత ఒప్పందాల పై సమీక్ష చెయ్యటం, రివర్స్ టెండరింగ్ లాంటి అనాలోచిత నిర్ణయాలతో, రాష్ట్రం పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతుందని, గల్లా జయదేవ్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుతో, ఇప్పటికే కొన్ని దేశాలు చట్టపరమైన చర్యలకు కూడా దిగాయని, ఈ చర్యలు రాష్ట్రానికి కాదని, దేశానికే ఇబ్బందని, దేశం బ్రాండ్ ఇమేజ్ కూడా పోతుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కు వెళ్ళిపోయిన కంపెనీల లిస్టు వివరిస్తూ, రూ.2200 కోట్లకు సంబంధించి లులూ గ్రూప్, బీఆర్ శెట్టి గ్రూపు రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు, ఆదానీ గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి 400 ఎకరాల స్థలాన్ని 89 ఎకరాలకు తగ్గించేశారని, తిరుపతిలో రూ.15 వేల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన రిలయన్స్ సంస్థ, ఒంగోలులో రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కావాల్సిన కాగిత పరిశ్రమ వెళ్లిపోయాయని, రాజధాని అమరావతి నిర్మాణం నుంచి సింగపూర్ ప్రభుత్వం కూడా వెళ్ళిపోయిందని ఆరోపించారు. అయితే గల్లా జయదేవ్ మాట్లాడే సమయంలో, వైసీపీ ఎంపీలు తీవ్ర నిరసన తెలిపారు. గల్లా జయదేవ్ ని చుట్టుముట్టినంత పని చేసారు. మిథున్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అని, ఆయన కూడా ఇలా మీద పడుతున్నారు అంటూ, గల్లా, స్పీకర్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు.