రాష్ట్ర సమస్యల పై ఇప్పటి వరకు మిత్రపక్షానికి గౌరవం ఇస్తూ సహకరించిన తెలుగుదేశం పార్టీ, ఇక రాష్ట్ర సమస్యల పై ఉపేక్షించేది లేదు అనే సంకేతాలు ఇచ్చింది.. మిత్రపక్షంలో ఉంటూ బీజేపీతో తెలుగుదేశానికి ఇబ్బంది ఉన్నా, వైసీపీ ఏ నాడూ రాష్ట్ర సమస్యల మీద పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదియ్యలేదు... దీంతో ఇప్పటికే మూడు సంవత్సరాలు అయిపోవటంతో, ఇక మిత్రపక్షమైన తెలుగుదేశమే రంగంలోకి దిగింది... మా సమస్యలు గురించి చెప్పండి అంటూ, నిన్న కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరీ నిలదీసి ఆశ్చర్యపరిచారు.. ఇవాళ రామ్మోహన్ నాయుడు, గల్లా జయిదేవ్ పార్లమెంట్ లో ప్రైవేటు మెంబెర్ బిల్ పెట్టి, కేంద్రం మీద హీట్ పెంచేశారు...
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంతో పటు, సవరణలపై లోక్‌సభలో ప్రైవేట్ బిల్లును గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రవేశపెట్టారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని, ప్యాకేజీ పదేళ్ల పాటు అమలయ్యేలా చట్టబద్దత కల్పించాలని ఆయన అన్నారు. కేంద్ర సహాయ ప్రాజెక్టులకు పదేళ్లపాటు కేంద్రమే నిధులు ఇవ్వాలన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా గల్లా జయదేవ్ చెప్పారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకి ఖర్చు అంతా కేంద్రమే పెట్టుకోవాలి అని అన్నారు...
అలాగే మరో పక్క, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్లమెంట్ లో రైల్వే జోన్ పై ప్రైవేటు బిల్ ప్రవేశపెట్టారు... మరో పక్క సాక్షాత్తు ముఖ్యమంత్రి పోలవరం పై కేంద్రంతో చర్చలు జరుపుతూ రంగంలోకి దిగారు... అలాగే కాపులు రిజర్వేషన్ అంశం కూడా ఇప్పటికే కేంద్రం కోర్ట్ లో ఉంది... ఇలా అన్ని వైపుల నుంచి ఇప్పటి వరకు కేంద్రం అవలంభిస్తున్న తీరు పై, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుంది. కేంద్రం ఈ రెండు బిల్లుల పై తన వైఖరి స్పష్టం చేయ్యనుంది... ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు వివరిస్తుంది... ఈ విధంగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి, పనులు పూర్తి చెయ్యటానికి, తెలుగుదేశం ప్రభుత్వం తన పార్టీ ఎంపీల చేత పార్లమెంట్ లో హీట్ పెంచేస్తుంది.