"మిస్టర్ ప్రైమ్ మినిస్టర్"... ఇది అన్నగారు తెలుగోడికి నేర్పిన ఆత్మాభిమానం.... చంద్రబాబు నేర్పిన ఆత్మస్తైర్యం.... దమ్మున్నోడు ఎవడికి తలవంచడు అనటానికి మొన్న గుంటూరు ఎంపీ స్పెచ్ ఒక ఉదాహరణ... సుమారు 14 నిమిషాల పాటు ఇంగ్లీష్ లో, ఆంధ్రా ప్రజల ఆక్రోశం ఈ దేశానికి ఘాటుగా చాటి చెప్పారు గల్లా జయదేవ్... బహుసా, ఇలాంటి పవర్ఫుల్ స్పీచ్, ఢిల్లీని డైరెక్ట్ గా, "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" పీపుల్ అఫ్ ఏపి ఆర్ నో ఫూల్స్ అంటూ ఘాటుగా స్పందించటం, ఈ తరం ఎప్పుడూ వినలేదో ఏమో కాని, ఇప్పటికీ గల్లా మాటలు చెవుల్లో తిరుగుతూనే ఉన్నాయి... మూడు రోజులు అయినా, సోషల్ మీడియా దద్దరిల్లుతూనే ఉంది...

galla 09022018 2

ముఖ్యంగా జయదేవ్ చివర్లో చెప్పిన మాటలు హైలైట్... ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూ, సొంత ప్రయోజనాల కంటే, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అని తలిచి, సాక్షాత్తు ఆర్ధిక మంత్రిని, ప్రధాన మంత్రిని దులుపుతూ ‘‘ఇప్పటిదాకా మీరు సంకీర్ణ ధర్మం పాటించలేదు. ఇదే చివరి అవకాశం. ఇప్పుడైనా పాటించండి. ఇలా చెప్పాలని గానీ, మిత్రపక్షం మనసు గాయపరిచేలా మాట్లాడాలనిగానీ మాకు లేదు. కానీ... మీరు మాకు అలాంటి పరిస్థితి కల్పించారు. ఇది కీలకమైన ఎన్నికల సంవత్సరం. కూటమిలోని మిత్రులకు, కొత్తగా మిత్రులు కావాలనుకునే వారికీ విషయం అర్థమవుతుంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి దీనికి సమగ్ర వివరణ ఇవ్వాల్సిందే.. కొంత మందిని ఎప్పుడూ మోసం చేయవచ్చు. కొంత మందిని అప్పుడప్పుడు మోసం చేయవచ్చు.. కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేరు. ఏపీ ప్రజలు కానీ, టీడీపీ కానీ మోసపోయే వారి జాబితాలో ఉండరు’’.ఏపీ ప్రజలు మూర్ఖులు కాదు!’ అని జయదేవ్‌ తన ప్రసంగాన్ని ముగించారు..

galla 09022018 3

తెలుగు ఎంపీలకు దమ్ము ఉందా ? పార్లమెంట్ లో ఎదో హడావిడి చేసి కూర్చుంటారు... ప్రధానిని చూస్తే పారిపోతారు... వీరికి ధైర్యం లేదు... వీరు పారిశ్రామికవేత్తలు... వీరు కాంట్రాక్టర్లు... ఇలా హైదరాబాద్ లో ఉన్న రంకు మీడియా, హైదరాబాద్ లో పని లేని సన్నాసులు, మొన్నటి దాకా పిచ్చి వాగుడు వాగారు... అలాంటిది ఒక ప్రధాన మంత్రిని పార్లమెంట్ లో పట్టుకుని "మిస్టర్ ప్రైమ్ మినిస్టర్" అంటూ ఒక తెలుగు ఎంపీ దుమ్ము దులుపితే, అది చూపించకుండా, సొల్లు వాగుతున్న హైదరాబాద్ మీడియాకు, సోషల్ మీడియాలో గల్లా స్పీచ్ కు వచ్చిన షేర్స్, కామెంట్స్, వ్యూస్, ఇవే మాట్లాడుతాయి... చివరగా ఈ దేశానికి కూడా గెట్టిగా చెప్తున్నాం "పీపుల్ అఫ్ ఏపి ఆర్ నో ఫూల్స్"...

Advertisements

Advertisements

Latest Articles

Most Read