మనసులో ఎంతో బాధ ఉన్న వ్యక్తి, ఆ బాధ అంతా వేరే వారికి చెప్పుకుంటే ఎలా ఉంటుంది ? వారు మన సమస్య తీర్చకపోయినా, మన మనసులో ఉన్న బాధ కొంత అయినా తగ్గుతుంది. నాలుగేళ్ల నుంచి మనం పడుతున్న బాధ, ఈ రోజు అవిశ్వాస తీర్మానం సందర్భంగా, 5 కోట్ల ఆంధ్రుల తరుపున, ఈ దేశానికి చెప్పారు గల్లా జయదేవ్. మన ఆక్రోశం, మన వేదన, మన రోదన, మన బాధ, నాలుగేళ్ళ నుండి పంటి బిగువునా అదిమి పెట్టుకున్న దుఃఖం, అన్నీ ఈ రోజు పార్లమెంట్ లో, ఈ దేశం ముందు ఉంచారు గల్లా. ఇక న్యాయం చెయ్యాల్సిన వారు ఏమి చేస్తారో చూడాలి.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, మరోసారి, మరింత గట్టిగా 5 కోట్ల ఆంధ్రుల ఆక్రోశం దేశానికి వినిపించిన గల్లా... టీడీపీ నాలుగు కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని గల్లా జయదేవ్ చెప్పారు.

galla 20072018 2

కేంద్రం ఏపీకి న్యాయం చేయకపోవడం మొదటి కారణమని, నమ్మకం లేకపోవడం రెండో కారణమని తెలిపారు. ఏపీకి ప్రాధాన్యం దక్కకపోవడం మూడో కారణమని, ఏపీపై కేంద్రం చూపుతున్న వివక్ష నాలుగో కారణమని గల్లా జయదేవ్ వివరించారు. అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీలకు మొదట ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఇది చాలా ముఖ్యమైన రోజు అని చెప్పారు. ఎన్డీఏ నుంచి బయటికి రాగానే మాపై కక్ష గట్టారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ కేంద్రం విస్మరించిందని విమర్శలు గుప్పించారు. ఆంధ్రాపై కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని గల్లా చెప్పుకొచ్చారు. అవిశ్వాసం అనేది బీజేపీ-టీడీపీ మధ్య వార్ కాదని.. మెజారిటీ-మొరాలిటీ మధ్య జరుగుతున్న యుద్ధమని గల్లా వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలపై నిలబడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తలుపులుమూసి మరీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన ఘటనను ఆయన సభలో మరోసారి ప్రస్తావించారు. ఏపీ ప్రజల ధర్మ పోరాటాన్ని పెద్దలు గ్రహించాలన్నారు. గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా టీఆర్ఎస్ ఎంపీలు మధ్యలో జోక్యం చేసుకొని ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ మరోలా ఉండేదని ఆయన అన్నారు. ఉమ్మడి ఏపీకి ఆదాయ వనరుగా హైదరాబాద్‌ ఉండేదని, హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని తెలిపారు. హైదరాబాద్‌ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని పేర్కొన్నారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా తెలిపారు.

galla 20072018 3

రాజ్యసభలో ఆనాడు ప్రధాని మన్మోహన్‌ ఆరు హామీలు ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు జిల్లాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పారిశ్రామిక రాయితీలు, పోలవరం ముంపు మండలాల విలీనం, రెవెన్యూలోటు పూడుస్తామని హామీలు ఇచ్చారని ఎంపీ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 2014లో తెలుగుతల్లిని నిలువునా చీల్చిందని, కాంగ్రెస్‌ తల్లిని చంపి బిడ్డను ఇచ్చిందని ఆనాడు మోదీ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని 2018లో జైట్లీ తేల్చి చెప్పారన్నారు. ఆర్థిక సంఘం అభ్యంతరాలను సాకుగా చూపారని విమర్శించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తమకు లేదా అని గల్లా ప్రశ్నించారు. విపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, మేనిఫెస్టోలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. అంతే కాదు, మోదీ ముందే మోదీ అంటే మోసం..మోసం అంటేనే మోదీ అని -సభలో తెలుగుదేశం ఎంపీల నినాదాలు చేసారు. ఆంధ్రోడి ఆక్రోశం, ఈ దేశానికి వినిపించారు జయదేవ్..

Advertisements

Advertisements

Latest Articles

Most Read