మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే రీసౌండ్ ఇంకా బీజేపీ నేతల చేవిల్లో తిరుగుతూ ఉండగానే, ఈ రోజు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రం పై విరుచుకు పడ్డారు. ఈ సారి ఎయిర్ పోర్ట్ ల పై, కేంద్రం చూపిస్తున్న వివక్ష పై జయదేవ్ ప్రశ్నించారు. అంతే కాదు, మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై ఎలా కక్ష తీర్చుకుంటుంది, వివరించారు. జయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల నుంచి విదేశీ విమానాల రాకపోకలకు అవకాశం కల్పించాలని ఎంపీ జయదేవ్ డిమాండ్ చేశారు. ఏపీ విభజన తర్వాత అంతర్జాతీయ విమానాల రాకపోకలకు చొరవ తీసుకుంటామని కేంద్రం ప్రకటించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో సౌకర్యాలు కల్పించబడినా ఇప్పటివరకు విదేశీ విమానాల రాకపోకలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి 2, 3 సర్వీసులను నిలిపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖలో నేవీ అధికారుల కొత్త ఆంక్షలతో స్పైస్‌జెట్, శ్రీలంక ఎయిర్‌లైన్స్ తమ సర్వీసులు నిలిపివేసే ఆలోచనలో ఉన్నారు. నేవీ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు గగనతలాన్ని అధికారులు వాడుకుంటున్నారు. విదేశీ విమాన సర్వీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడమేంటి’’ అని జయదేవ్ ప్రశ్నించారు.
విజయవాడ కేంద్రంగా కార్గో సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్న హామీ కూడా ఇప్పటివరకు అమలుకాలేదని గల్లా మండిపడ్డారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో కార్గో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కార్గో సేవలు అందుబాటులోకి రాలేదని, కార్గో సేవలు అందుబాటులోకి వస్తే రైతులకు ఉపయోగాలు ఉంటాయన్నారు. ఈ అంశాలను కేంద్ర విమానయానశాఖ వెంటనే పరిశీలించాలని జయదేవ్ డిమాండ్ చేశారు. అశోక్ గజపతి రాజు రాజీనామా చేసిన తరువాత, పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్ లు రెడీ అవుతున్నాయి అనుకుంటున్న టైంలో, ఆయన రాజీనామా చెయ్యటంతో, తరువాత అధికారులు , ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా , కేంద్రం మాత్రం ఎదో ఒక సాకులు చెప్పి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ రాకుండా చేస్తుంది.