అంతా అనుకున్నట్టే, పవన్ కళ్యాణ్ ట్వీట్ లు మొదలు పెట్టాడు. ఒక పక్క నరేంద్ర మోడీ లాంటి బలమైన నేతను, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ, ఆయన ముందే, నువ్వు మోసగాడివి అంటూ, గల్లా జయదేవ్ కడిగి పడేసిన విధానం, దేశమంతా అభినందిస్తున్నారు. మోడీ లాంటి నేతను, గల్లా జయదేవ్ ఇలా దులిపేసారు ఏంటి అంటూ అందరూ అంటుంటే, అమిత్ షా దగ్గర కొత్తగా ఉద్యోగానికి చేరిన పవన్ కళ్యాణ్ మాత్రం, ఇదేమి స్పీచ్ అంటూ ట్వీట్ చేసారు. ఈ రోజు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన స్పీచ్ చాలా బలహీనంగా, పేలవంగా ఉంది అంటూ, పవన్ ట్వీట్ చేసారు. స్పెషల్ ప్యాకేజికి ఒప్పుకున్న వాళ్ళకు, ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు అంటూ, వింతగా ట్వీట్ చేసారు. గల్లా జయదేవ్ చాలా స్పష్టంగా ఆన్ రికార్డు చెప్పారు, మేము సెప్టెంబర్ 2016 దాకా ప్రత్యేక హోదా అడిగాం, అప్పుడు కేంద్రం వచ్చి, ఎవరికీ హోదా ఇవ్వటం లేదు, సమానమైన ప్యాకేజీ ఇస్తాం అంటే ఒప్పుకున్నాం, నాలుగో బడ్జెట్ లో కూడా ఇవ్వలేదు కాబట్టి, మేము ఎదురుతిరిగాం అని చెప్తున్నా, పవన్ పాత పాటే పాడుతున్నారు.

pk 20072018 2

ఇప్పుడు గల్లా మాట్లాడింది చాలా వీక్ స్పీచ్ అని, బీజేపీ తో కుమ్మక్కు అయ్యి, ఎదో ప్రజలను మభ్య పెడుతున్నారు అంటూ వరుస ట్వీట్ లు చేస్తున్నారు పవన్. ఉదయం కూడా, అసలు ఇప్పుడు ఇలాంటివి ఎందుకు టైం దండగ, నాలుగేళ్ళు ఏమి చెయ్యకుండా, ఇప్పుడు ఇది ఎందుకు అంటూ, అవిశ్వాసం పై ట్వీట్ చేసారు. నిజానికి, పవన్ కళ్యాణ్, మీరు అవిశ్వాసం పెట్టండి, నేను ఢిల్లీ వచ్చి 100 మంది మద్దతు తెస్తాను అన్నారు. మరి ఇప్పుడు మాత్రం, అసలు ఈ చర్చ ఎందుకు అంటున్నారు. ఎందుకంటే, ఇప్పుడు పవన కళ్యాణ్, అమిత్ షా దగ్గర ఉద్యోగంలో చేరారు. అమిత్ షా ఏమి చెప్తే, అది చెయ్యాల్సిన పరిస్థితి పవన్ ది.

pk 20072018 3

అందుకే, రాష్ట్రమంతా, నరేంద్ర మోడీ పై తిరగబడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, బీజేపీ ని ఒక్క మాట కూడా అనటం లేదు. ఇప్పుడు కూడా, గల్లా జయదేవ్ అంత ధైర్యంగా, మోడీని ఎదురిస్తే, ఇదేమి స్పీచ్ అంటూ, గల్లా స్పీచ్ ను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు పవన్. ఇవన్నీ, ఎందుకు చేస్తున్నారో, ఏంటో, అమిత్ షా గారికే తెలియాలి. మరో పక్క చెల్లలు కవిత గారికి ధన్యవాదాలు అని గతంలో ట్వీట్ చేసిన పవన్, ఇప్పుడు కెసిఆర్ చేస్తున్న పనికి ఏమి సమాధానం చెప్తారు ? ఆంధ్రప్రదేశ్ కు ప్రోత్సాహకాలు ఇస్తే, మేము వ్యతిరేకిస్తాం అంటున్నారు కెసిఆర్. మరి, మీరు ఉండే తెలంగాణాలో, కెసిఆర్ ని అడిగే దమ్ము మీకు ఉందా ? అమిత్ షా ని అనలేరు, మోడీ ని అనలేరు, కెసిఆర్ ను అనలేరు.. వీరందరి పై ఒంటరి పోరాటం చేస్తున్న, చంద్రబాబుని మాత్రం బలహీన పరుస్తారు... ఇదేమి రాజకీయం పవన్ ? మరీ ఇంత లొంగిపోయావు ఏంటి పవన్ ? గల్లా అంత బాగా మాట్లాడితే, నీలో ఉన్న ఉక్రోషం ఇలా బయటకు వచ్చిందా ? ఢిల్లీ పై పోరాటం చేస్తున్న ఈ టైంలో, మీరు చేస్తున్న ఈ పని మాత్రం, ఎవరు హర్షించరు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read