అంతర్జాతీయ స్మగ్లర్‌, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై అలిపిరిలో జరిగిన దాడిలో, ప్రధాన పాత్ర పోషించిన, అంతర్జాతీయ స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డికి ఈ రోజు బెయిల్‌ మంజూరైంది. ప్రసుత్తం ఆయన కడప జైల్లో ఉన్నారు. ఈ రోజు బెయిల్ రావటంతో, మరి కొద్ది సేపట్లో ఆయన, కడప జైలు నుంచి విడుదల కానున్నారు. గంగిరెడ్డి 27 స్మగ్లింగ్ కేసుల్లో ఉన్నారు. ఆయన్ను చంద్రబాబు హయంలో పట్టుకున్నారు. విదేశాల్లో ఉండగా, ఇంటర్ పోల్ సాయంతో, అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. 2015 నుంచి గంగిరెడ్డి కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు. 2015 నుంచి 2017 వరకు గంగారెడ్డి జైలులో ఉన్నాడు. 2017 జనవరి నుంచి 2018 జనవరి వరకు పీడీ యాక్ట్ కింద గంగారెడ్డిని జైలులో ఉంచారు. 2018 నుంచి ఈ రోజు వరకు గంగారెడ్డిని రిమాండ్ ఖైదీగా ఉంచారు.

gangireddy 20082019 2

అరెస్ట్ జరిగింది ఇలా... ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి, ముందుగా కర్నూలు నుంచే విదేశాలకు పరార్ అయ్యాడు. 2014 మార్చి 3న వెల్దురి మండలంలో ఓ గోడౌన్‌లో దాదాపు రూ.80 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ కేసులో కర్నూలు జిల్లాకు చెందిన రమేష్‌రెడ్డి సహకారంతో గంగిరెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులుగుర్తించారు. దీంతో గంగి రెడ్డిని పట్టుకుని 2014 మే 5న పోలీసులు అరెస్టు చేశారు. అయితే 45 రోజుల పాటు కర్నూల్ జిల్లల, డోన్‌ సబ్‌ జైలులో ఉన్న గంగిరెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నార. అయితే స్థానిక కోర్ట్ బెయిల్ నిరాకరించింది. తరువాత హైకోర్టుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు గంగి రెడ్డి. అయితే బెయిల్ పై బయటకు రాగానే, నకిలీ పాస్‌పోర్టు, గుర్తింపు కార్డుతో దుబాయ్ పారిపోయాడు.

gangireddy 20082019 3

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఆయన సియం అయితే, తన బండారంతో పాటు, తన వెనుక ఉన్న వారు కూడా బయట పడతారని గ్రహించి, అతన్ని కొన్ని శక్తులు, దేశం దాటించాయి. అయితే తరువాత చంద్రబాబు సియం అయ్యారు. 2003లో అలిపిరి దాడిలో, గంగిరెడ్డి సహకారంతోనే మావోయిస్టులు తన పై దాడి చేసారని, ఇప్పుడు స్మగ్లింగ్ చేసి గంగిరెడ్డి వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారని, చంద్రబాబు నాయుడు గంగిరెడ్డి పరారీ కాగానే అప్పటి గవర్నర్‌ ఇఎల్‌ నర్సింహన్‌ కు గంగిరెడ్డి పై ఫిర్యాదు చేసారు ఫిర్యాదు చేశారు. అయితే చంద్రబాబు సియం అవ్వగానే, పోలీసులు ఈ కంప్లైంట్ పై సీరియస్ అయ్యి, అతని పై రెడ్ కార్నర్ నోటీస్ జరీ చేసారు. అదే సమయంలో గంగిరెడ్డి దుబాయ్ నుంచి మారిషస్‌కు వెళ్లడాని తెలుసుకుని, ఫిబ్రవరి 23, 2015న అరెస్టు చేశారు. ఇన్నాళ్ళకు జగన్ ప్రభుత్వం రాగానే, గంగిరెడ్డికి బెయిల్ లభించింది. అయితే ఇప్పటికే చంద్రబాబు భద్రత పై, జగన్ ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవటం లేదు అంటున్న టిడిపి, గంగిరెడ్డి బయటకు రావటంతో, చంద్రబాబుకు ప్రాణహాని మరింత పెరిగిందని ఆరోపిస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read