విజయవాడ పోలీసులు తీసుకున్న ఒక నిర్ణయం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంసం అయ్యింది. విజయవాడ పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిధిలో ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆంక్షలు ఏదో విఐపి వస్తున్నారనో, లేక ఏదో ఒక రోజో, రెండు రోజులో కాదు. ఏకంగా వచ్చే ఫిబ్రవరి 15 వ తరీఖు వరకు ఈ అంక్షలు పెట్టారు. దీంతో ఈ అంక్షలు ఎందుకు పెట్టారో అంతుబట్టటం లేదు. గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిధిలో 144 సెక్షన్ విధిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 15 వరకు, ఈ నిషేధాజ్ఞలు ఉంటాయని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదు అనే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి 250 మీటర్ల పరిధిలో, ఎవరూ గుంపులుగా ఉండటానికి వీలు లేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆ పరిధిలో కర్రలు, ఇతర మారణాయుధాలతో ఎవరూ తిరగకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కనుక చర్యలు తీసుకుంటాం అని పోలీసులు తెలిపారు. దీంతో అసలు ఈ అంక్షలు ఎందుకు పెట్టారు అనే చర్చ జరుగుతుంది. చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో.
గన్నవరం ఎయిర్ పోర్ట్ పరిధిలో 144 సెక్షన్.. ఏకంగా 50 రోజుల పాటు... ఎందుకని ఈ సడన్ నిర్ణయం ?
Advertisements