ఎన్నాళ్ళుగానో గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుచూస్తున్న గజెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టును కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంజూరు చేసింది. ఇక కస్టమ్స్ సెంటర్ ఏర్పాటు ఒక్కటే ఇంటర్నేషనల్ సర్వీసులకి అడ్డంకి... దాని కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.... ఇటీవలే ఇమ్మిగ్రేషన్ విభాగం ఉన్నతాధికారులు గన్నవరం ఎయిర్పోర్టును సందర్శించి ఇక్కడి మౌలిక సౌకర్యాలు, సెక్యూరిటీ తదితర వాటిని పరిశీలించారు... వాస్తవానికి ఈ నెల రెండో తేదీనే ఈ సమాచారం రాష్ట్రానికి వచ్చింది... దీని పై అఫిషియాల్ గా ఎయిర్ పోర్ట్ అధారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ జరీ చేసింది...
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విదేశీ విమాన ప్రయాణికులు రాకపోకలు కోసం ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది... దీని కోసం విజయవాడ డిప్యూటీ పోలీస్ కమీషనర్ గజరావు భూపాల్ ను సివిల్ అధారిటీగా నియమిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు... గన్నవరం ఎయిర్ పోర్ట్ కు విదేశీయులు రావాలన్నా ఇక్కడ నుంచి వెళ్లాలన్నా విధిగా సివిల్ అథారిటీ అనుమతి ఉండాల్సిందే. 1948 ఫారినర్స్ చట్టంలో 3( 1)(ఏ), 5( 1)(ఏ) ప్రకారం విదేశీ విమాన ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది...
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడపాలంటే విధిగా ఇమ్మిగ్రేషన్ తో పాటు కస్టమ్స్ విభాగం ఉండాలి. వాటిలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, త్వరలోనే కస్టమ్స్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతికి విదేశీయులు రాకపోకలు జరిపేందుకు వీలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవలే ముంబై విమాన సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గన్నవరానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు మంజూరవ్వటం, సివిల్ అథారిటీగా డీసీపీ-1 గజరావు భూపాల్ను ప్రభుత్వం నియమించింది. ఇమ్మిగ్రేషన్ విభాగానికి అవసరమైన చెక్ పాయింట్, లగేజీ తనిఖీ విభాగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్దంగా ఉన్నాయి....