టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరి కొద్ది సేపట్లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోకున్నారు. ఈ రోజు నరసరావుపేటలో అనుష కుటుంబాన్ని లోకేష్ పరామర్శించనున్నారు. ఘటన జరిగిని ఏడు నెలలు అవుతున్నా, ఇప్పటికీ న్యాయం చేయకపోవటం పై, లోకేష్ నిరసన తెలపనున్నారు. అయితే పోలీసులు మాత్రం, దీనికి ఒప్పుకోవటం లేదు. అనుమతి లేదు అని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరుకు చెందిన నేతలు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. టిడిపి కీలక నేతలు అందరినీ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్దకు వస్తున్న నేతలను, వచ్చిన వారిని వచ్చినట్టే అరెస్ట్ చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర హైసెక్యూరిటీ పోలీస్ వారు పెట్టారు. సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదురు అవుతున్నారు. ఎయిర్ పోర్ట్ కు వచ్చే వారిని, అలాగే లోపల నుంచి బయటకు వచ్చే వారిని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

gannavaram 09092021 1

ఇది ఎయిర్ పోర్ట్ లేదా బస్ స్టాండ్ అనేది అర్ధం కావటం లేదని అంటున్నారు. మరి కొద్ది సేపట్లో లోకేష్ గన్నవరం రానున్నారు. లోకేష్ తో పాటుగా, వంగలపూడి అనిత, శ్రీరాం చినబాబు, ఎంఎస్ రాజు, తదితర నేతలు వస్తున్నారు. మరి లోకేష్ ని నరసరావుపేట వెళ్ళటానికి పోలీసులు అనుమతి ఇస్తారా, లేక ఆయన్ను అరెస్ట్ చేసి దగ్గరలోనే పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తారా, లేదా ఎయిర్ పోర్ట్ లోనే అటు నుంచి అటు హైదరాబాద్ పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఈ విషయం పై పోలీసులు మాత్రం, ఏమి చెప్పటం లేదు. అయితే టిడిపి నేతలను మాత్రం, కాలు కదప నివ్వటం లేదు. బయటకు వస్తే అరెస్ట్ చేసి లోపల వేస్తున్నారు. మారు మూల ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తీసుకుని వెళ్తున్నారు. మొత్తం మీద లోకేష్ ని ఆపటానికి, వందల మంది పోలీసులు పెట్టి, హడావిడి చేస్తున్నారు. వచ్చిన తరువాత లోకేష్ ని ఎక్కడకు తేసుకుని వెళ్తున్నారు, ఏమి చేస్తారు అనేది చూడాల్సి ఉంది. మరి ఈ రోజు ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read