గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కావటానికి, అవసరమైన ఇమ్మిగ్రేషన్ కార్యకలాపాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది... అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్ పడింది. మరో రెండు రోజుల్లో ఈ సేవలు అందించటానికి వీలుగా కేంద్రం నోటిఫికేషన్ వెలువరించటానికి రంగం సిద్ధమైంది...
పోయిన వారం, ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. చెన్నై నుంచి ఎయిర్‌పోర్టు అథారిటీ జనరల్ మేనేజర్, జాయింట్ పోలీసు కమిషనర్ రమణకుమార్, డీసీపీ గజరావు భూపాల్ ఈ బృందంలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్ స్టాఫ్ కావాలని, ఈ బృందం డీజీపీ సాంబశివరావుని కోరింది.. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్ ఇమ్మిగ్రేషన్ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు... ఈ నేపధ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి కేంద్రహోంశాఖ కార్యదర్శి, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో విజయవాడ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ కేంద్రం ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.