ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి, తలమానికంగా ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, మరి కొన్ని గంటల్లో కొత్త విమాన సర్వీసు ప్రారంభం కానుంది. సరిగ్గా నాలుగు నెలల కిందట ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి చెన్నైకి విమాన సర్వీసు ప్రారంభించింది. ఇప్పుడు ఇదే సంస్థ రాష్ట్ర రాజధాని అమరావతికి, కడప నుంచి మరో సర్వీసు నడపడానికి సిద్ధమైంది. జిల్లాలోని విద్యార్థులు, మధ్య తరగతి ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి నేరుగా ఒక్కటంటే ఒక్క రైలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడప జిల్లా నుంచి విజయవాడకు ప్రయాణించే వారు అధికంగా ఉన్నారు. రైల్లో విజయవాడ వెళ్లాలంటే రేణిగుంట వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళ్లాలి లేదా నంద్యాల మీదుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ఇలా వెళ్లాలంటే కడప టు అమరావతి విజయవాడకే దాదాపు 18 గంటలకు పైగా సమయం పట్టేది.

gannavaram 01032018 2

ఇప్పుడు విజయవాడకే విమాన సర్వీసు రావడం, రైల్లోని మొదటి ఏసీ టిక్కెట్‌ ధర, ఏసి బస్సు ధర కంటే తక్కువుగా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకంలో భాగంగా రీజినల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ లో భాగంగా ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి మూడో సర్వీసును మార్చి 1 నుంచి విజయవాడకు ప్రారంభిస్తోంది. ప్రారంభ ఆఫర్‌ ధర రూ.599 నుంచి ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేశారు. మామూలు రోజుల్లో, 903 రూపాయాలు ఉంటుంది. ఈ పథకంలో భాగంగా నడిచే విమాన సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తాయి. ఈ సర్వీసుల ప్రతిరోజూ నడుస్తూ ఉంటాయి. జిల్లా ప్రజలు సాధారణ, జాతీయ పండుగల సమయాల్లో తక్కువ ధరకే విమానంలో ప్రయాణించి తమ కోరికను తీర్చుకోవచ్చు. పండుగ సమయాల్లో విమాన ధరలు సాధారణ టికెట్‌పై 50 శాతం పైగానే తగ్గింపు ధర ఉంటుంది.

gannavaram 01032018 3

ఇప్పుడు కడప నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలకు ట్రూజెట్‌ సంస్థ తమ సర్వీసులను నడపడమే గాకుండా త్వరలో కడప నుంచి చెన్నై నుంచి బెంగళూరు మధ్య నడపడానికి సిద్ధం అవుతుంది. విమాన టికెట్‌ ధరలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఒక రోజు ఎక్కువ, మరో రోజు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీకెండ్‌లో విమాన ధరలు ఎక్కువగా ఉంటాయి. నెల, 15 రోజుల ముందే టిక్కెట్‌ బుక్‌ చేసుకుంటే ధర తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఉదయం 7.40 గంటలకు ట్రూజెట్‌ విమానం వస్తోంది. ఈ సర్వీసు కడపకు ఉదయం 8.05 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి కడప నుంచి విజయవాడకు 10.30 గంటలకు వస్తుంది. ఇదే విమానం ఇక్కడ నుంచి 10.35 గంటలకు హైదరాబాద్‌ వెళుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read