Sidebar

06
Tue, May

సింగపూర్‌కు విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరి కొద్ది రోజుల్లోనే సింగపూర్ కి గన్నవరం నుంచి సర్వీస్ లు మొదలవనున్నాయి. విజయవాడ నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ సర్వీసును అందిస్తున్నామని ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ప్రకటించింది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ప్రాతిపదికన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం మేరకు అక్టోబర్‌ 2 తేదీ నుంచి వారంలో రెండు రోజుల పాటు సింగపూర్‌కు ఇండిగో తన విమాన సర్వీసును ప్రారంబించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.

gannavaram 07092018 2

180 సీట్లుండే ఈ విమానాన్ని వారంలో విజయవాడ నుంచి రెండు, మూడుసార్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఆగస్టు 27 నుంచి సేవలు ప్రారంభించాలనుకున్నారు. కాని అక్టోబర్‌ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్టు తెలిసింది. వారంలో రెండు రోజుల పాటు విమాన సర్వీసును ఇండిగో విమాన సర్వీసును సింగపూర్‌కు నడుపుతుంది. వారంలో ఆ రెండు రోజులు ఎప్పుడు ? ఏ సమయంలో ఇండిగో విమాన సర్వీసును ఉంటుంది. ఆ షెడ్యూల్‌ను అధికారికంగా మరికొద్ది రోజులలోఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించనుంది. ప్రస్తుతానికి అందిన సమాచారం మేరకు ఎయిర్‌ బస్‌ 320 విమానాన్ని 180 సీటింగ్‌తో ఉంటుందని ఇండిగో సంస్థ ప్రకటించింది.

gannavaram 07092018 3

సింగపూర్‌కు విమాన సర్వీసు నడపటం వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో ఉండనే చెప్పాలి. గన్నవరం ఎయిర్ పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయ్యి చాలా నెలలు అయ్యింది. అశోక్ గజపతి రాజు కేంద్రం మంత్రిగా ఉండటంతో, పనులు చకచకా జరిగాయి. మరి కొద్ది రోజుల్లో దుబాయ్ కి, సింగపూర్ కి గన్నవరం నుంచి సర్వీస్ లు మొదలవుతాయి అనుకుంటున్న టైంలో, ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు రావటం, తెలుగుదేశం మంత్రులు రాజీనామా చెయ్యటంతో, గన్నవరం కధ మొదటికి వచ్చింది. ఎంత మంది ప్రైవేటు ప్లేయర్స్ వచ్చి, మేము ఫ్లైట్ నడుపుతాం అన్నా పర్మిషన్ ఇవ్వలేదు. సింగపూర్‌కు ఇంటర్నేషనల్‌ చార్టర్డ్‌ ఫ్లైట్‌ సర్వీసు నడిపే విషయంలో డీజీసీఏ నో అనేసింది.

gannavaram 07092018 4

దేశీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు సంబంధించి అనుమతులు ఇవ్వటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అంతర్జాతీయంగా చార్టర్డ్‌ ఫ్లైట్స్‌కు అనుమతి ఇవ్వలేమని డీజీసీఏ చెబుతున్నట్టు తెలిసింది. అయినా పట్టు వదలకుండా డీజీసీఏతో అనుమతుల కోసం ప్రయత్నాలు జరిపారు అధికారులు. వెంకయ్య నాయుడుతో కూడా చెప్పించారు, చివరకు చంద్రబాబు కూడా రంగంలోకి దిగటంతో, ఎట్టకేలక అనుమతి లభించింది. చార్టర్డ్‌ ఫ్లైట్‌ కాకుండా, మామూలు ఫ్లైట్ కే అనుమతి వచ్చింది. విజయవాడ నుంచే నేరుగా సింగపూర్‌కు విమానాన్ని నడపనున్నారు.అలాగే విజయవాడ నుంచి సౌత్‌ఈస్ట్‌ ఏషియాలో సింగపూర్‌ తొలి విమాన సర్వీసును నడుపుతున్న ఘనతను ఎయిర్‌ పోర్టు సాధించనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read