చంద్రబాబు ప్రతిపక్ష హోదా టార్గెట్ గా, వైసీపీ రాజకీయం నడుపుతుంది. తెలుగుదేశం పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మేల్యేలను, తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం కొన్నాళ్ళు పాటు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యకుండా, ఉప ఎన్నికలు రాకుండా కూడా ప్లాన్ చేస్తున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లభించాలి అంటే, కనీసం 17 సీట్లు అయినా ఉండాలి. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆరు నుంచి ఏడు మందిని లాగటానికి వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా చేస్తే చంద్రబాబు స్థాయి పడిపోతుందని, తద్వారా ఆనంద పడవచ్చు అని వైసీపీ అనుకుంటుంది. అయితే, తెలుగుదేశం మాత్రం, ఇవన్నీ కొట్టి పారేస్తుంది. పార్టీలో నుంచి ఎవరూ వెళ్ళరని, ఒక వేళ వెళ్లి ప్రతిపక్ష హోదా పోయినా, చంద్రబాబుకి ఏమి అవుతుందని, అసెంబ్లీలో వెనుక బల్లలో కూర్చుంటారని, అంతకు మించి ఏమి ఉండదని అంటున్నారు.

ganta 05122019 2

అయితే గత రెండు రోజులుగా, ఒక ప్రచారం అయితే బలంగా ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీని లాక్కున్న వైసీపీ నేతలు, ఇప్పుడు గుంటూరు జిల్లాలోని కొంత మంది ఎమ్మేల్యేలను, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న కొంత మంది ఎమ్మేల్యేలను లాగటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇందు కోసం, ఏకంగా ముగ్గురు మంత్రులు, రంగంలోకి దిగారని, అసెంబ్లీ మొదలయ్యే లోపే, వారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చేస్తారని, చంద్రబాబుకు ఈ సారి అసెంబ్లీ మొదలైన రోజే, ప్రతిపక్ష హోదా పోగొట్టి, షాక్ ఇస్తామని అంటున్నారు. వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే, బీజేపీలోకి కూడా ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే వెళ్తున్నారని, ఆయన గంటా శ్రీనివాస్ అంటూ, మరో ప్రచారం కూడా చేస్తున్నారు.

ganta 05122019 3

అయితే, వీటి అన్నిటి పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్ గేం అని చెప్తుంది. వైసీపీ ఏ ఎమ్మెల్యేల పేర్లు అయితే ప్రచారం చేస్తుందో, ఆ ఎమ్మెల్యేలు అందరితో చంద్రబాబు, ఫోన్ లో మాట్లాడారని, తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఎవరూ కూడా, పార్టీ మారటం లేదని, ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారం అని చెప్పారని, టిడిపి అంటుంది. ఇక మరో పక్క, గత కొద్ది రోజులుగా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తో కూడా చంద్రబాబు మాట్లాడారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, వచ్చి నాతొ మాట్లాడండి అంటూ చంద్రబాబు చెప్పారని, అలాగే డిసెంబర్ 6, టిడిపి ఆఫీస్ ఓపెనింగ్ కు కూడా రావాలని చంద్రబాబు ఆహ్వానించటంతో, తప్పకుండ వస్తానని గంటా చెప్పారని తెలుస్తుంది. మొత్తానికి, చాలా రోజలుగా సైలెంట్ గా ఉన్న గంటా, చంద్రబాబు ఫోన్ కాల్ తో మనసు మార్చుకుంటారా ? రేపు జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తారో రారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read