టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌తో గంటా శ్రీనివాస‌రావు దాదాపు గంట పాటు మంత‌నాలు జ‌రిపారు. వీరి భేటీపై అధికారికంగా ఏ ప్ర‌క‌ట‌నా ఇంకా విడుద‌ల కాలేదు. అయితే పార్టీలు మార‌డం, ప‌ద‌వులు పొంద‌డం ఒక నిరంత‌ర ప్ర‌క్రియలా చేప‌ట్టే గంటా కొన్నాళ్లుగా టిడిపికి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అధికార వైసీపీలో చేర‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశార‌ని  క‌థ‌నాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. లేటెస్ట్‌గా డిసెంబ‌ర్ మొద‌టివారంలో కూడా వైసీపీలోకి జంప్ కొడ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఏమైందో ఏమో కానీ కాపు హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ అవ‌తారం ఎత్తారు గంటా. మామూలు రాజ‌కీయ నాయ‌కుల్లా కాకుండా నిరంత‌రం పార్టీలు, ప్ర‌జ‌ల‌నాడిపై స‌ర్వేలు చేయించే గంటా శ్రీనివాస‌రావుకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని తేలింద‌ని, దీంతో ఊగిస‌లాట ధోర‌ణికి క‌ట్టిపెట్టి పార్టీలో కొన‌సాగేందుకు మొగ్గు చూపార‌ని టాక్ వినిపిస్తోంది. జ‌న‌సేన‌-టిడిపి జ‌త క‌ట్టడం గ్యారంటీ అని తేలిపోవ‌డంతో మౌనం వీడిన గంట మోగింద‌ని తెలుస్తోంది. గంటా శ్రీనివాస‌రావు ప్యాకేజీ పాలిటిక్స్ ని టిడిపి ఎంట‌ర్ టైయిన్ చేస్తుందా? క‌ష్ట‌కాలంలో తెర‌మ‌రుగై క‌లిసొచ్చే కాలంలో తిరిగొచ్చిన గంటాకి పూర్వ ప్రాధాన్యం ఇస్తుందా త్వ‌ర‌లో తేల‌నుంది. టీడీపీ అధిష్టానం గంటా ఎటువెళ్లినా ప‌ట్టించుకోద‌నే వార్తలు వస్తున్న నేపథ్యంలో  లోకేష్ తో భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. గంట‌కి పైగా గంటా ఏం చ‌ర్చించార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విశాఖ‌లో బాబు, లోకేష్ ప‌ర్య‌ట‌న‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌త్తా లేని గంటా క‌లుగులోంచి బ‌య‌ట‌కొచ్చింది ఎందుకో అనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read