ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనాలంటూ వచ్చిన ఆహ్వానాన్ని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు తిరస్కరించారు. తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని తనను పిలిచారని ఏపీ సీఎం చంద్రబాబును కనీసం ఆహ్వానించలేదని, ఆంధ్రాకు చెందిన వాడిగా తాను ఆ మహాసభలకు వెళ్లడం సబబు కాదని అన్నారు. ఆయన మాటల్లో "నాకు ఆహ్వానం అందింది... 18 సాయంత్రం రమ్మన్నారు... నేను తప్పకుండా వెళ్దాము అనే అనుకున్నా.. కాని ఈ లోపు, ఒక వార్త నన్ను చాలా బాధ పెట్టింది... 5 కోట్ల ఆంధ్రలకు ప్రతినిది అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఈ సభలకు పిలవలేదు అని నాకు తెలిసింది.. "
"పిలవకపోవటం ఏంటి, ఇవి తెలంగాణా మహాసభలు కాదు, తెలుగు మహాసభలు... పక్కనే ఉన్న రాష్ట్రము, నిన్నటి వరకు కలిసి ఉన్నాం.. అన్నీ విబేధాలు సర్దుకుంటున్నాయి అనుకుంటున్నా సందర్భంలో ఇటువంటి పరిణామం జరగటం నాకు చాలా బాధ వేసింది. నేను పుట్టి పెరిగిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలవకపోవటం అంటే, నేను వెళ్ళటంలో అర్ధం లేదు. ఎందుకంటే ఎవర్ని అన్న పెళ్లికి పిలిచినప్పుడు మనం, కుటుంబ పెద్దని పిలవకుండా, ఇంట్లో వాళ్ళని పెళ్ళికి పేలిస్తే ఎవరూ వెళ్లరు, యజమానిని పిలిచినాకే మిగిలిన వారిని పిలుస్తాం" అని గరికపాటి గారు అన్నారు...
తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లో లేరా? తెలుగు భాష అభివృద్ధి కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేస్తున్న మండలి బుద్దప్రసాద్ గారు కనిపించలేదా? ఆంధ్రప్రదేశ్ కి చెందిన అనేక మంది కళాకారులు, కవులు ఆహ్వానానికి అర్హులు కాదా? ప్రపంచపటంలో హైదరాబాదు కి ప్రఖ్యాతి తీసుకొచ్చిన చంద్రబాబు ని మీరు ఆహ్వనించకుండా అవమానించవచ్చు...బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన అన్న తారకరామారావు గారిని స్మరించకపోవచ్చు..కాని సాటి తెలుగు సోదరుల హృదయాలను గాయపర్చారు. మీఆహ్వానాన్ని తిరస్కరించిన శ్రీ గరికపాటి వారి గళం మొదలు మాత్రమే ! అవమానించిన ప్రభుత్వపెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవమానాన్ని ఆత్మగౌరవంతో ఎదుర్కున్న గరికపాటి తెలుగు సోదరుల అభిమాన ధనాన్ని పొందారు..ధన్యులు...