గజల్ శ్రీనివాస్, ఎంతటి గలీజు పనులు చేస్తూ దొరికిపోయాడో అందరికీ తెలిసిందే... ఈయన పైకి ఎంత మంచివాడిలా, పెద్ద మనిషిలా ఉన్నాడో, అతని రెండో కోణం అంత గలీజుగా వీడియోలు రూపంలో బయట పడింది... అయితే, గజల్ శ్రీనివాస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది... 2017 మే 28న స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గజల్ శ్రీనివాస్ ని నియమించింది... ఈ గలీజు పని బయటపడిన తరువాత, అతన్నిగజల్ శ్రీనివాస్‌ను స్వచ్ఛాంధ్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది...
ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే... కేశిరాజు శ్రీనివాస్ అలియాస్ గజల్ శ్రీనివాస్ 'సేవ్ ది టెంపుల్' అన్న పేరిట స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్నారు... అదే సంస్థలో 'ఆలయ వాణి' పేరిట ఒక రేడియో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు... ఈ ప్రోగ్రామ్ కోసం పని చేస్తున్న మహిళ గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 29న ఫిర్యాదు చేశారు...
వీడియోలోతో సహా బండారం మొత్తం బయటపడింది... పోలీసులు అరెస్ట్ చేసారు... ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. కేసులో ఏ2 నిందితురాలు పరారీలోనే ఉందని కావునా గజల్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం గజల్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. గజల్ శ్రినివాస్ కేసులో బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.