ఎన్నికల సంవత్సరం ముందు, అంటే ఆగష్టు 2018లో, విశాఖ మాజీ ఎంపీ కొత్తపల్లి గీత కొత్త రాజకీయపార్టీని విజయవాడలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జనజాగృతి పార్టీ పేరుతో ఆమె కొత్త పార్టీ పెట్టారు. మహామహా యోధులే పార్టీలను పెట్టి, నడపలేక ఆపసోపాలు పడుతుంటే, కొత్తపల్లి గీత పార్టీ పెట్టటం ఆశ్చర్యం కలిగిస్తుందని, రాజకీయ విశ్లేషకులు అప్పట్లోనే అన్నారు. అయితే ఈమెతో పార్టీ పెట్టించింది బీజేపీ పార్టీ అని, అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఓట్లు చీల్చటం కోసమే, ఆమె చేత కొత్త పార్టీ పెట్టుస్తున్నారని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటమే ఆమె టార్గెట్ అనే వార్తలు వచ్చాయి. దీనికి తగట్టే, ఆమె పార్టీ పెట్టిన కొత్తలో , బీజేపీ ఐటి సెల్, ఆమె కోసం పని చేసిన సంగతి తెలిసిందే. దళిత, గిరిజన సామాజిక వర్గాలను చంద్రబాబు నుంచి దూరం చేసే ఆలోచనలో ఈమెతో పార్టీ పెట్టించి, విశాఖలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబుని ఓడించటంలో సక్సెస్ అయ్యారు.

అయితే ఇప్పుడు ఎన్నికలు అవ్వటం, చంద్రబాబుని ఓడించే టార్గెట్ పూర్తి కావటంతో, ఆమె ఇక పార్టీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆమె బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నారు. అంతే కాదు, తన జన జాగృతి పార్టీని త్వరలోనే బీజేపీ పార్టీలో విలీనం చేస్తానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని కొత్తపల్లి గీత అన్నారు. బీజేపీ నేత రాంమాధవ్‌తో కలిసి బీజేపీలో చేరినట్లు ఆమె చెప్పారు. ఒక పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని అనుకున్నానని, కాని అది నెరవేరకపోవడంతో, బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరానని చెప్పారు. బీజేపీ ద్వారానే ఏపీకి ఎంతో మేలు జరుగుతుందని ఆమె అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read