హైదరాబాద్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు... ఇలాంటి సదస్సుకు చంద్రబాబుని ఆహ్వానించకపోవటమా ? అసలు హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా చంద్రబాబే కదా చేసింది అనుకున్నారు అందరూ... ఎన్ని రాజకీయ కక్షలు ఉన్నా, కనీసం ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో భాగం అయినందుకు, ముఖ్యమంత్రికి ఇచ్చే ప్రోటోకాల్ అయినా పాటించారా అనుకున్నారు... అందుకే ఆంధ్రప్రదేశ్ లో అందరూ, కెసిఆర్ ని అనుమానించారు... కాని, అది తప్పు అని చెప్తుంది "CNN-News18" అనే నేషనల్ మీడియా.... హైదరాబాద్ సదస్సుకు చంద్రబాబుని ఆహ్వానించకపోవటానికి కారణం మోడీనా అనే అనుమానాలు వచ్చేలా కధనం రాసింది...

ges 29112017 2

చంద్రబాబు అంటేనే ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ.. హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా అంది చంద్రబాబు చేసిందే... ఇలాంటి చంద్రబాబుని ఈ గ్లోబల్ సమ్మిట్ కి ఎందుకు పిలవలేదు అంటూ "CNN-News18" కధనం రాసింది... ఇలాంటి గ్లోబల్ సమ్మిట్ లో సిఈఓ గా పేరు ఉన్న చంద్రబాబు లేకపోవటంతో ఆ లోటు కనిపించింది అని కధనం రాసింది... "CNN-News18" కధనం ప్రకారం, చంద్రబాబుని కావాలనే ఈ సమ్మిట్ కి పిలవలేదు అంటుంది...

ges 29112017 3

ఈ ఈవెంట్ తెలంగాణాలో జరిగినా, మొత్తం నీతీ ఆయోగ్ కనుసన్నల్లోనే జరిగింది... ఎవర్ని పిలవాలి, ఈవెంట్ ఎలా ఉండాలి అనేది మొత్తం నీతీ ఆయోగ్ ఇస్తా ప్రకారం జరిగింది... ఈ ఈవెంట్ తెలంగాణాలో జరిగింది అని మాటే కాని, మొత్తం నీతీ ఆయోగ్ చెప్పినట్టే జరిగింది... మరి ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న చంద్రబాబుని ఎందుకు పిలవలేదు, చంద్రబాబుకి ఆ గౌరవం ఎందుకు ఇవ్వలేదు అంటూ "న్యూస్ 18" కధనంలో పెర్కుంది... "న్యూస్ 18" కధనం ప్రకారం, తెలంగాణా ప్రభుత్వ పెద్దలని సంప్రదించగా, తెలంగాణా ప్రభుత్వానికి ఏ మాత్రం దీనిలో సంబంధం లేదు అని, ఆహ్వానాలు అన్నీ నీతీ ఆయోగ్ మాత్రమే పంపించింది అని రాసింది.... అంటే ఈ కధనం ప్రకారం, బీజేపీ పెద్దలు కావాలనే, చంద్రబాబుని అవమానించినట్టు అర్ధమవుతుంది... రాజకీయ కారణాలతో పాటు, చంద్రబాబు కనుక అక్కడ ఉంటే, వీరికి ఇబ్బంది అనుకున్నారో ఏమో, కావాలని చంద్రబాబుకి ఆహ్వానం ఇవ్వకుండా, ఇలా అవమానించారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read