నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం పై పోరాడకుండా, కేంద్రం పై పోరాడుతున్న, చంద్రబాబుని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల రోజులు ఉత్తరాంధ్రలో ఉంటూ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ గురించి కాని, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకపోవటం గురించి కాని, ఒక్క మాట కూడా మాట్లాడలేదు పవన్. పైగా, ఎదురు వీటి కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. మోడీ పై పోరాటం చేస్తున్న చంద్రబాబుని బలహీన పరిచే వ్యూహం అమలు చేస్తున్నారు. ఇందులో భగంగానే, ఉత్తరాంధ్రలో అసలు అభివృద్ధి జరగటం లేదు అని చెప్తూ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం చెయ్యాలనే ప్రచారం మొదలు పెట్టి, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే కుట్రలో ప్రధాన పావుగా మారాడు.
పదే పదే పవన్, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో, మొన్నటి వరకు పవన్ విషయంలో చూసి చూడనట్టుగా ఉన్న తెలుగుదేశం, ఇక నుంచి ధీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అధినేత పవన్ కళ్యాణ్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్‌కు 25 ప్రశ్నలను సంధించారు. పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల్ని పవన్ కళ్యాణ్ కళ్లతో చూడలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది తానే అనే భ్రమలో ఆయనున్నారని ఆక్షేపించారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తేల్చిన నిధుల లెక్కపై పవన్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని గంటా నిలదీశారు.
రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్... మోదీ, అమిత్ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారని గంటా విమర్శించారు. భాజపా మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లు ఉందనే సందేహాన్ని వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన దస్త్రాలు కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉన్నాయని.. వీటి గురించి మాట్లాడే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. ఆధారాల్లేకుండా అవాకులు, చవాకులు పేలడం సరికాదని అన్నారు. కళ్లుండి చూడలేని కబోదిలా పవన్ మాట్లాడుతున్నారని మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్‌తో పవన్ కుమ్మక్కయ్యారని అర్థమవుతోందని గంటా అన్నారు. బీజేపీ, వైసీపీ స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని మంత్రి విమర్శించారు.