పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తున్నారా... సంవత్సరం క్రితం, ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరికేస్తా అన్న వీర వనిత... అప్పట్లో ఈవిడ గిరిజన ఎమ్మల్యే కాబట్టి, ఆవిడ మీద చర్యలు తొందరగా తీసుకోలేరు అనే ఉద్దేశంతో, జగన అలా ఎగదోసారు... ఈ స్టేట్మెంట్ ఒక సెన్సేషన్.... ముఖ్యమంత్రి తల నరికేస్తా అని బహిరంగంగా అంటే, చంద్రబాబు నైజం తెలిసిందేగా, నవ్వి ఊరుకున్నరు... కాలమే అన్నిటికి పరిష్కారం అన్నారు... ఇప్పుడు ఆ కాలమే వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సమాధానం చెప్తుంది... అప్పుడు ఎగదోసి ఆ తీవ్ర వ్యాఖ్యలు చేపించన వారు, ఇప్పుడు ఈవిదిని తొందరగా వదిలించుకోవటానికి చూస్తున్నారు...
ఎమ్మెల్యే ఈశ్వరి విశాఖ ఏజెన్సీలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీని వీడి టీడీపీలో చేరిపోవడంతో, ఈశ్వరి సహకారంతో శెట్టి ఫాల్గుణ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాక టీడీపీలో చేరిన కుంభా రవిబాబు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. ఈనెల 19న కొంతమంది అనుచరులతో పాడేరులో సమావేశం ఏర్పాటుచేసి నగరానికి చెందిన కొందరు వైసీపీ నేతలను ఆహ్వానించారు. ఆ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త సత్తి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అరకులోయ టికెట్ రవిబాబుకేనని ప్రకటించారు...
దీంతో ఈశ్వరి విజయసాయిరెడ్డి మీద ఫైర్ అయ్యారు... పార్టీలో కొంతమంది నేతలు తమకు బాగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వాపోయారు... ఏంటి సార్ మమ్మల్ని పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారా..? పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జికి సమాచారం ఇవ్వకుండా అరకులో పార్టీ సమావేశం ఎలా పెట్టారు? జగనే సర్వస్వం అని నమ్ముకుని పనిచేస్తున్న మాకు మాటమాత్రంగానైనా చెప్పకుండా అరకులోయ అసెంబ్లీ టికెట్ రవిబాబుకేనని ఎలా ప్రకటించేస్తారు’ అని విజయసాయిరెడ్డిని నిలదీశారు. మొత్తానికి ఇప్పుడు గిడ్డి ఈశ్వరి పరిస్థితి పూర్తి కన్ఫ్యూజన్ లో ఉంది...