జగన్ మాంచి ఫాంలో ఉన్నారు... స్వింగ్, గూగ్లీ, ఫాస్ట్, స్పిన్ ఇలా అన్ని రకాలుగా బౌలింగ్ చేస్తూ సొంత పార్టీ వికెట్లు పడగోడుతున్నారు... సెల్ఫ్ గోల్స్ ఎక్స్పర్ట్ అని మరో మారు నిరూపించుకున్నారు.... 22 మంది ఎమ్మల్యేలు, జగన్ ని విడిచి వెళ్ళినా జగన్ మాత్రం మారటం లేదు... వీరిలో చాలా మంది, జగన్ మనస్తత్వం నచ్చకే వెళ్ళిపోయారు అని చెప్పినా, జగన్ ప్రవర్తనలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు.... ఎవరైనా ఎమ్మల్యేలు, నేను నీ పార్టీ మారిపోతున్నా అంటే, పిలిచి బుజ్జగిస్తారు... కాని జగన్ దగ్గర మాత్రం రివర్స్... పొతే పో... నేను త్వరలో ముఖ్యమంత్రి అవుతున్నా, అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు....
వివరాల్లోకి వెళ్తే, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి, విజయసాయి రెడ్డి వ్యవహార శైలి మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే... నా ఆత్మాభిమానం దెబ్బ తింటే, నేను మీతో కొనసాగటం కష్టం అని మూడు రోజులు క్రిందట చెప్పారు... అయితే, జగన్ పిలిచి మాట్లాడితే అన్నీ సర్దుకుంటాయిలే అని, పార్టీ వర్గాలు అనుకున్నాయి... జగన్ అయితే ఫోన్ లో మాట్లాడాడు కాని, జరిగింది రివర్స్.... చూడు నువ్వు ఏంటో నాకు అనవసరం, విజయసాయి అన్న చెప్పినట్టు నేనే వింటున్నా, నువ్వు వినటానికి ఏమైంది... ఆయన మాట వినాల్సిందే.... ఆయన మాట వినే నేను రేపు ముఖ్యమంత్రి అవుతున్నా..... నువ్వు కూడా విను... వినను అంటావా, వెళ్ళిపో... నాకు పోయేది ఏమి లేదు... మరో సంవత్సరంలో నేను ముఖ్యమంత్రి అవుతున్నా... నువ్వే కాదు, ఇంకా ఎంత మంది పోయినా, నేను ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, అంటూ జగన్ గిడ్డి ఈశ్వరి పై ఫైర్ అయ్యారు...
ఈ పరిణామంతో, అసలకే కాక మీద ఉన్న గిడ్డి ఈశ్వరి, జగన్ కు బెస్ట్ అఫ్ లక్ చెప్పి ఫోన్ పెట్టేసారు... ఆమె అనుచరులతో విషయం చెప్పి, ఈ పార్టీలో ఉంటే వీళ్ళకి ఊడిగం చెయ్యటమే సరిపోతుంది... మన గిరిజనుల జీవితాలు బాగుపాడవ్.. లేట్ గా అన్నా నిజం గ్రహించాం... పార్టీ మారిపోదాం అనుకుంటున్నా... గిరిజన ఎమ్మల్యేలు అందరూ చంద్రబాబే న్యాయం చేస్తారు అని ఆయనతో వెళ్తున్నారు... నేను ఇలాంటి వారితో ఉంది, ఆత్మాభిమానం చంపుకోలేను... మనం కూడా చంద్రబాబు వెంట వెల్లిపోదాం అంటూ అనుచరుల వద్ద చెప్పి, జిల్లా తెలుగుదేశం నాయకులకి సమాచారం అందించారు... సోమవారం ఉదయం 10 గంటలకు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు.... జగన్ ఇదే వైఖరిలో ఉంటే, కొంత మంది సైకో ఫాన్స్, పైడ్ బ్యాచ్ తప్ప, జగన్ దగ్గర ఎవరూ మిగలరు అని లోటస్ పాండ్ వర్గాలే అంటున్నాయి...