జగన్ మోహన్ రెడ్డి... విజయ సాయి రెడ్డి... వీరిద్దరూ ఎంత గొప్ప వాళ్ళు అనేది, వారు A1,A2 గా ఉన్న 11 సిబిఐ కేసులు, మరికొన్ని ఈడీ కేసులు చెప్తాయి... అయితే, వీరి ఇరువురి గొప్పతనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా పడింది... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడటం వెనుక ఇవే కారణాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి బద్ద వ్యతిరేకి అయిన ఈశ్వరి ఆ పార్టీలో చేరుతారా అని వైసిపీ పార్టీ కార్యకర్తలే నమ్మలేకపోయారు ? కాని, పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను నిర్దారించుకున్న తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది...
ఏజెన్సీ ప్రాంతంలో గిడ్డి ఈశ్వరి మంచి పట్టున్న నేత... అక్కడ జగన్ ఇమేజ్ కంటే, గిరిజన ప్రజల్లో గిడ్డి ఈశ్వరి ఇమేజ్ ఎక్కువ... సహజంగా తనకంటే ఎక్కువ పేరు ఉన్న వారిని టార్గెట్ చేసే జగన్, ఏజెన్సీ ప్రాంతంలో తన పట్టు కోసం, సొంత ఎమ్మల్యేకే ఎర్త్ పెట్టె ప్రయత్నం చేసాడు.... దీనికి అన్ని పనులకి ఉపయోగించినట్టే, విజయసాయిని ఉపయోగించాడు... అయితే ఇక్కడ కధ రివర్స్ అయ్యింది...
రాజ్యసభ ఎన్నికల అనంతరం గిడ్డి ఈశ్వరిని పక్కనపెట్టేయడమేనని, ఆమె పాడేరు ఎమ్మెల్యే సీటును మరొకరికి ఇస్తామని విజయిసారెడ్డి చెప్పినట్టు, అది కాస్త ఫోన్ రికార్డింగ్స్ రూపంలో గిడ్డి ఈశ్వరికి చేరినట్టు తెలుస్తోంది. అరకు ఇన్ఛార్జీగా తాను ప్రతిపాదించిన ఫల్గుణను కాదని, కుంభా రవిబాబును నియమించాలన్న వ్యాఖ్యలు కూడా ఆ టేపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే రోజు, ఈశ్వరి విజయసాయిరెడ్డిని కలిసి తన వద్ద ఉన్న ఫోన్ రికార్డింగ్స్ వినిపించగా, ఆ టేపుల్లో ఉన్న వ్యాఖ్యలు విని విజయసాయిరెడ్డి నోటివెంట మాట రాలేదట. తాను ఎవరి వద్ద అయితే ఆ విషయాలు ప్రస్తావించానో.. వారిద్దరు తనను ఇరికించారని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అడ్డంగా దొరికిపోవటంతో, విజయసాయి, జగన్, ఇద్దరూ ఆమెను బుజ్జగించాల్సింది పోయి, ఎదురు దాడి చేసి, ఉంటే ఉండు, పొతే పో, ఎలాగు సంవత్సరం తరువాత నేనే ముఖ్యమంత్రి అవుతాను అనే స్థాయిలో మాటలు రావటంతో, ఈశ్వరి ఆ పార్టీని వదలాల్సి వచ్చింది..