ముఖ్యమంత్రి అవ్వటం కోసం జగన్ ఎన్ని తిప్పలు పడుతున్నాడో చూస్తున్నాం... పాదయాత్ర అంటూ తిరుగుతూ, నోటికి వచ్చిన మాటలు చెప్పేసి, నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తూ, చివరకి నేను అధికారంలోకి వస్తే ఆవులు ఎక్కవ పాలు ఇచ్చేలా చేస్తాను అంటున్నారు... అయితే జగన్ చెప్పే దొంగ హామీలను ఒక విద్యార్థిని ధైర్యంగా ఎదుర్కుంది... ‘‘మీరు కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా చదివిస్తామని చెబుతున్నారు. చదివిస్తే జాబ్ గ్యారంటీనా’’ అంటూ కల్లూరుకు చెందిన డి.ఫార్మసీ విద్యార్థిని నజ్మా వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను ప్రశ్నించింది...
పాదయాత్రలో భాగంగా పులిచెర్ల మండలం కల్లూరులో జరిగిన మైనారిటీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న జగన్ పేద విద్యార్థులందరినీ ఉచి తంగా చదివిస్తామని చెప్పారు. ఈ సమ యంలో వేదికపైకి వచ్చిన నజ్మా తొలుత ‘‘నేను డి.ఫార్మసీ చదివాను. ఈ కోర్సుకు ఎక్కడా జాబ్ రాలేదు. మీరేమో ఎంత వరకైనా ఉచితంగా చదివిస్తామని చెబు తున్నారు. చదివిన తర్వాత జాబ్ గ్యారెంటీగా ఇస్తారా సార్’’ అంటూ ప్రశ్నించడంతో జగన్ షాక్ తిన్నారు...
క్షణం తర్వాత తేరుకున్న జగన్ ‘‘తల్లీ.. చదివిస్తాం... జాబ్ గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు. అలా ఎవరైనా జాబ్ గ్యారెంటీ ఇస్తామని చెప్పే నాయకుల్ని నమ్మొద్దు. జాబ్ కావాలంటే ప్రత్యేక హోదా రావాలి. దాని కోసం మీరు ప్రార్థనలు చేయండి’’ అంటూ సూచించారు. అయితే ఇక్కడ ముందుగా ఒక అమ్మాయిని రెడీ చేసి, స్క్రిప్ట్ ఇచ్చిన అమ్మాయి చివరి నిమషంలో రాకపోతే, ఆమె బదులు ఇంకో అమ్మాయిని స్టేజి ఎక్కించగా ఆ అమ్మాయి ఇలా మాట్లాడటంతో జగన్ షాక్ తిన్నారు... తరువాత ప్రశాంత్ కిషోర్ టీంకు జగన్ చురకలు అంటించారు...