బౌద్ధ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు, విశ్వశాంతి కోసం నవ్యాంధ్రలో బౌద్ద సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మూడు రోజులపాటు నిర్వహించే అమరావతి బౌద్ద సాంస్కృతిక ఉత్సవాలు శనివారం నుంచి విజయవాడలో ప్రారంభంకానున్నాయి. స్వరాజ్య మైదానంలో ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. 15 దేశాల నుంచి 1500 మంది బౌద్ధ భిక్షువులు ఈ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరవుతారు. ప్రపంచ రికార్డు కోసం లక్ష మంది భిక్షువులతో బుద్ధ అఖండ నామస్మరణ చేయనున్నారు.
ఉదయం ఏడు గంటలకు శాంతియాత్రతో ప్రారంభమయ్యే ఉత్సవాలు ధర్మానికి పుట్టినిల్లు అయిన అమరావతి కేంద్రంగా అఖండ నామస్మరణతో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ఈ ఉత్సవం వేదిక కానుంది. స్వరాజ్యమైదానంలో ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. 15 దేశాల నుంచి 1500 బౌద్ద భిక్షులు ఈ సాంస్కృతిక ఉత్సవాలకు హాజరవుతారు. ప్రపంచ రికార్డు కోసం లక్ష మంది భిక్షువులతో బుద్ద అఖండ నామస్మరణ చేయనున్నారు. 1,500 మంది ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటుండగా, మిగిలిన వారంతా ఆన్లైన్లలో పాల్గొంటారు... శ్రీలంక, చైనా, టిబెట్, మలేషియా, సింగపూర్, అమెరికా, థాయ్లాండ్, జపాన్, నేపాల్ లండన్, కొరియా వంటి దేశాలను బౌద్ద గురువులు, భిక్షువులు ఇక్కడికి వస్తున్నారు.
రెండో రోజున బౌద్ద మతగురువు దలైలామా హాజరవుతారు. ప్రధానంగా శ్రీలంకకు చెందిన బౌద్ద సన్యాసిని బిక్కుని కుసుమతో పాటు కనక సభ ఆర్ట్ సెంటర్ సంచాలకురాలు సిరీరామ, అమెరికా నుంచి బౌద్దాచార్యుల , ప్రజ్వలరత్న వజ్రా చార్యా, ప్రొఫెసర్ దమ్మా జ్యోతి వంటి ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భిక్షువులు, గురువులకు రాష్ట్రంలో ఉన్న ప్రముఖ బౌద్ద క్షేత్రాలను సందర్శించే విధంగా ఏర్పాటు చేశామని పర్యాటకాభివృద్ధి శాఖ ఎండీ శుక్లా చెప్పారు.