విశాఖలో రెండు రోజులపాటు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి ముందు, జరుగుతున్నప్పుడు టిడిపి కీలక నేతలు ఎవ్వరూ నోరు విప్పలేదు. వైసీపీని విమర్శిస్తే ఏపీ బ్రాండ్ డ్యామేజ్ అవుతుందనే ఉద్దేశంతో మౌనంగా ఉన్నారు. అయితే వైసీపీ తాము నిర్వహించిన సమ్మిట్ కనివినీ ఎరుగని రీతిలో విజయం సాధించిందని, చంద్రబాబు కంటే ఎన్నో రెట్లు పెట్టుబడులు సాధించామని డప్పాలు కొట్టుకోవడం ఆరంభించారు. దీంతో టిడిపి యువనేత నారా లోకేష్ అది గ్లోబల్ సమ్మిట్ కాదు లోకల్ ఫేక్ సమ్మిట్ అంటూ మీడియా ముందుకొచ్చారు. సమ్మిట్, ఎంవోయూలో డొల్లతనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. సమ్మిట్ కి గ్లోబల్ అంటున్నారు..ఒక్క అంతర్జాతీయ కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు లోకేష్. అలాగూ 370 కంపెనీలతో ఎంవోయూలు 13 లక్షల పెట్టుబడులు అని ప్రకటించిన సీఎం జగన్ రెడ్డి అందులో 70 కంపెనీల పేర్లే ఎందుకు ప్రకటించారని నిలదీశారు. గ్లోబల్ టు లోకల్ దింపిన లోకేష్, ఇన్వెస్టర్లు ఫేక్ అని ఆధారాలు బయటపెట్టారు. మరోవైపు 1 లక్ష రూపాయలు పెట్టుబడితో 2022లో పులివెందుల డైరెక్టర్లతో ఆరంభమైన ఇండోసోల్ 76 వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని, 25 వేల ఎకరాలు కొట్టేసేందుకు దీనిని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. టిడిపి హయాంలో 39,450 పరిశ్రమలు తెచ్చామని, వాటి ద్వారా 5,13,350ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ మంత్రే అసెంబ్లీలో ప్రకటించారని లోకేష్ గుర్తు చేశారు. టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకీ, కడపకు వెల్ స్పన్, చిత్తూరుకు టీసీఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, ఫాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు, కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ ఉత్పత్తి కేంద్రాలు, నెల్లూరు హీరోమోటార్స్, అపోలో టైర్స్, ప్రకాశం ఏషియన్ పేపర్ మిల్స్, గుంటూరు, కృష్ణాకు అశోక్ లైల్యాండ్,కేసీపీ, హెచ్.సీ.ఎల్, ఉభయగోదావరిలో అనేక ఫిషరీస్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తో ఒప్పందం, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజియెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు తెచ్చామని ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డి తాను తెచ్చిన ఒక్క కంపెనీ అయినా చూపగలరా అని సవాల్ విసిరారు. పాదయాత్రలో చిత్తూరు జిల్లాలో టిడిపి తెచ్చిన కంపెనీల ముందు సెల్ఫీ దిగి చాలెంజ్ విసిరితే స్పందించలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అని ఎద్దేవ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఆఫ్రికా మోడల్ మూడు రాజధానులు తెచ్చిన సీఎం జగన్ రెడ్డి ఆఫ్రికా మాదిరిగానే నిరుద్యోగిత శాతాన్ని 30 శాతం చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. యువనేత లోకేష్ ఆధారాలతో సహా సమ్మిట్, పెట్టుబడులు ఫేక్ అని ప్రకటించారు. దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పై, లోకేష్ బయట పెట్టిన ఆధారాలతో, వైసీపీ ఉక్కిరిబిక్కిరి
Advertisements