ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్విడ్ ప్రోకో అనే పదం చాలా సుపరిచితం. సహజంగా ఇలాంటి పదాలు, న్యాయ వృత్తిలో ఉన్న వారికి, అలాగే రాజకీయాల్లో ఉన్న వారికి బాగా తెలుస్తాయి. అయితే ఇలనాటి క్లిష్టమైన పదం, దాని అర్ధం, అది ఎందుకు వాడతారు అనేది, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. దీనికి ప్రధాన కారణం, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు, బెయిల్, జైలు, కోర్టు వాయిదాలు, ఇలా అనేకం చూసిన ప్రజలకు, ఆ పదం ఏమిటో అర్ధమై పోయింది. క్విడ్ ప్రోకో అంటే, నీకు ఇది నాకు అది. అది కూడా ప్రభుత్వ సొమ్ముతో లబ్ది పొందటం. ఉదాహరణకు జగన్ మోహన్ రెడ్డి పై మోపిన ఆరోపణల్లో ఒకటి ఏమిటి అంటే, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్ మోహన్ రెడ్డి ఆ పదవిని అడ్డు పెట్టుకుని, ప్రభుత్వం నుంచి కొంత మంది పారిశ్రామిక వేత్తలకు మేలు చేసారని, భూములు ఇచ్చారని, దానికి ప్రతి ఫలంగా, జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో ఆ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలని. పది రూపయల షేర్ లు, మూడు నాలుగు వందలకి కొనటం, ఇలా జరిగాయి. క్విడ్ ప్రోకో అంటే ఇదే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తరువాత, ఇలాంటి వాటి పై, ఇప్పటి వరకు పెద్దగా ఆధారాలు బయట పడలేదు. అయితే ఇప్పుడు మూడు రోజులు క్రిందట జరిగిన వ్యవహారంతో, మళ్ళీ క్విడ్ ప్రోకో బయటకు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున, వాదించినందుకు, ఇద్దరు న్యాయవాదులుకు, రూ.1.34 కోట్లు చెల్లించారు. ఒక లాయర్ కోసం, అంత డబ్బు చెల్లించటంతో, అందరూ అవాక్కయ్యారు. అసలు ఈ విషయం ఏమిటో తేల్చే పని చేసింది సోషల్ మీడియాతో పాటుగా తెలుగుదేశం పార్టీ. అమరావతికి సంబందించిన కేసులో సుప్రీం కోర్ట్ లో వాదనలు వినిపించినమ్డుకు, నిరంజన్ రెడ్డి అనే న్యాయవాదికి 96 లక్షలు, అలాగే మోహన్ రెడ్డి అనే న్యాయవాదికి 38.50 లక్షలు చెల్లించారు. ఇంత పెద్ద మొత్తం చెల్లించటంతో, అసలు ఈ న్యాయవాదులు ఎవరు అని ఆరా తీయగా, వీళ్ళు జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ తరుపున వాదిస్తున్న న్యాయవాదులుగా తేలింది. ఇప్పుడు ఈ అంశాన్ని క్విడ్ ప్రోకో అని టిడిపి ఆరోపిస్తుంది. తన వ్యక్తిగత కేసులు వాదించే లాయర్లకి, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని, ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము ఇస్తున్నారని, ఇది క్విడ్ ప్రోకో కిందకు వస్తుందని, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ లో, ఈ అంశం కూడా ఉపయోగ పడుతుంది అంటూ, టిడిపి ఆరోపిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఆరోపణలకు ప్రభుత్వం, ఎలాంటి సమాధానం చెప్పలేదు.