స్వామి కార్యం స్వకారం ఒకేసారి పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. భోగి పండగ రోజు కూడా జగన్ రెడ్డి పాలనని ఎత్తి చూపే అవకాశంగా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ``ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి`` కార్యక్రమం తలపెట్టిన నుంచి ఎలా అడ్డుకోవాలో తెలియని వైసీపీ ఏకంగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని ప్రధాన ప్రతిపక్షం టిడిపితోపాటు విపక్షాలన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. సీపీఐ రామక్రిష్ణ వేసిన పిల్ ని విచారించిన హైకోర్టు ఈ జీవోని సస్పెండ్ చేసింది. జీవోని సస్పెండ్ చేసినా, నిరంకుశ పాలకుడి తెచ్చిన జీవో గురించి మరింత అవగాహన పెంచేందుకు టిడిపి నిర్ణయించుకుంది. పాత వస్తువులు, ఉపయోగించనివి భోగీ మంటల్లో వేయడం ఆనవాయితీ. జగన్ రెడ్డి ఆదేశాలతో తెచ్చిన జీవో1ని భోగీ మంటల్లో వేసి నిరసన తెలపాలని టిడిపి అధినేత పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోనూ టిడిపి నేతలు భోగి మంటలు వేదికగా వైసీపీ సర్కారు నియంత నిర్ణయాలను ధిక్కరిస్తున్నామని చాటిచెబుతూ, జీవో 1 ప్రతులను మంటల్లో వేశారు. నారావారి పల్లెలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా చీకటి జీవోని భోగి మంటల్లో వేశారు.
పండుగ రోజే జగన్ కు భారీ షాక్ ఇచ్చిన టిడిపి
Advertisements