కరవుకాటకాలు... వెనుకబాటుతనం... ఉపాధి లేమి... వనరులున్నా వినియోగించుకోలేని స్థితి. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాను తలచుకుంటే గుర్తుకు వచ్చేవి ఇవే... ఇక మీదట ఈ పిలుపు, ఆ తలపు మారనుంది. రాష్ట్రానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, జిల్లాకు తలమానికమైన కీలక పరిశ్రమ జిల్లాలో ఏర్పాటు కానుంది. దేశంలోనే అతి పెద్ద FDIగా, రూ.27 వేల కోట్ల పెట్టుబడితో 18 వేల మందికి ఉపాధి లక్ష్యంతో కాగిత గుజ్జు పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీనికి సమీపంలోనే 15 వేల మందికి ఉపాధి కల్పించే రామాయపట్నం పోర్టు నిర్మాణం కానుంది. ఈ రెండు కీలక ప్రాజెక్టులకు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్రం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై ఒత్తిడి పెంచుతూ వచ్చిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సొంతగానే రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు నడుం బిగించారు.

prakasm 09012019

ఈ క్రమంలో కీలక ముందడుగు వేశారు. ప్రకాశం జిల్లాలో నిర్మించాలని భావిస్తున్న రామాయపట్నం ఓడరేవుకు కేంద్రం సహకరించకపోయినా.. స్వశక్తితోనే ఈ పోర్టును నిర్మించాలని నిర్ణయించి ఈ రోజు శంకుస్థాపన చేసేందుకు ముహూర్తం కూడా నిర్ణయించారు. పేపరు పరిశ్రమకు కలిసొచ్చిన అంశాలు : ప్రకాశం జిల్లా సమీపంలోని నేలలు అనుకూలంగా ఉండడం, ముడిసరకు (జామాయిల్‌, సుబాబుల్‌) విరివిగా లభించడం, సమీపంలోనే రామాయపట్నం పోర్టు ఏర్పాటు కానుండడం కాగిత గుజ్జు పరిశ్రమ ఏర్పాటుకు కలిసొచ్చే అంశాలు కావడంతో పరిశ్రమ ఏర్పాటుకు అన్ని పనులు చకచకా జరుగుతున్నాయి. ఇండోనేషియా కేంద్రంగా నడుస్తున్న ఈ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలకు తమ ఉత్పత్తులను చేరవేస్తోంది. మన దేశంలో ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పడం ఇదే తొలిసారి. ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పరస్పర ఒప్పంద పత్రాలు మార్చుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

prakasm 09012019

సాకారం దిశగా రామాయపట్నం పోర్టు : * గుడ్లూరు మండలం రావూరులో ప్రభుత్వమే ఈ ఓడరేవును నిర్మించనుంది. * నాన్‌-మేజర్‌ పోర్టుగా దీన్ని నిర్మించనున్నారు. దీనికి 4,652 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. * దీని ద్వారా కనీసం 15 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. * ఈ పోర్టుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే చేవూరులో కాగిత పరిశ్రమ నెలకొల్పనున్నారు. * పోర్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చే సమయానికే పరిశ్రమ కూడా కార్యకలాపాలు మొదలు పెడుతుందని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌ పరిశ్రమ వివరాలు: * పరిశ్రమ పేరు : ఆంధ్రా పేపర్‌ ఎక్సలెన్స్‌ (ఆసియా పేపర్‌ అండ్‌ పల్ప్‌) * పెట్టుబడి : తొలి దశలో రూ. 27 వేల కోట్లు (3.85 బిలియన్‌ డాలర్లు) * ఉత్పత్తి సామర్థ్యం : 5 మిలియన్‌ టన్నులు (ఏడాదికి) * కావాల్సిన భూమి : 2,450 ఎకరాలు * ప్రాంతం : గుడ్లూరు మండలం చేవూరులో (రామాయపట్నం పోర్టు ప్రతిపాదిత స్థలానికి కొద్ది దూరంలోనే) * ఉపాధి కల్పన : 18 వేల మందికి (ప్రత్యక్షంగా 6 వేలు, పరోక్షంగా 12 వేల మందికి)

Advertisements

Advertisements

Latest Articles

Most Read